రాష్ట్రీయం

ఎక్సైజ్ ఆదాయం 12,191.63 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన రెవెన్యూ కంటే ఎక్కువగా సాధించినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ ఆర్‌వి చంద్రవదన్‌ను అభినందించారు. 2015-16 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ నుంచి 11,707.04 కోట్ల రెవెన్యూను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా 104.14 శాతం ఎక్కువ రెవెన్యూ సాధించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,191.63 కోట్ల రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ద్వారా వసూలైంది. దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్), బీరు అమ్మకాల ద్వారా రూ.12,705.36 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఏడాది కంటే ఇది 16.74 శాతం ఎక్కువగా ఉండడం విశేషం.