రాష్ట్రీయం

రైతుబంధు అమలు చేయాలి: సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెంలగాణ ప్రభుత్వం గతంలో ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్ పద్ధతిని రద్దు చేసి, ఏకంగా డిజిటల్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని భావించిందని అసంపూర్తిగా జరిగిన ఈ ప్రక్రియ వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న డిజిటల్ పాస్ పుస్తకాలతో పాటు గత రెండు విడతల రైతుబంధును కూడా రైతులకు అమలుచేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 9 లక్షల డిజిటల్ పాస్‌పుస్తకాలు రైతులకు ఇంకా అందలేదని, అధికారుల నిర్లక్ష్యం, వివిధ సమస్యలే దీనికి కారణమని అన్నారు. దీంతో ఖరీఫ్, రబీలో రెండు విడతలుగా ఇచ్చిన రైతుబంధుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలు కూడా వీరికి అందక నష్టపోతున్నారని అన్నారు. పాత పాస్‌పుస్తకాలు చెల్లక, కొత్త డిజిటల్ పాస్ పుస్తకాలు అందక రైతులు పంట రుణాలు పొందలేకపోతున్నారని , పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి , తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రెవిన్యూ సమస్యలపై పుంఖానుపుంఖాలుగా ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని , ఉద్యోగుల అవినీతిని అదుపులోకి తెచ్చి వారితో పూర్తిస్థాయిలో పనిచేయించుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.