రాష్ట్రీయం

కృష్ణ మాదిగ అంబేద్కర్ వ్యతిరేకి: పిడమర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: అంబేద్కర్ మహర్, జగ్జీవన్‌రామ్ చమర్ అంటూ మాల, మాదిగల మధ్య మందకృష్ణ మాదిగ గోడవలు పెట్టారని టీఆర్‌ఎస్ నాయకుడు పిడమర్తి రవి ఆరోపించారు. సహజంగా మందకృష్ణ మాదిగ అంబేద్కర్ వ్యతిరేకని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం పిడమర్తి రవి మీడియాతో మాట్లాడుతూ, ఈ వేసవిలో ఏ పని పాట లేక పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉదంతాన్ని మందకృష్ణ మాదిగ వివాదం చేశారన్నారు. అంబేద్కర్ జయంతిలో మాదిగలను మందకృష్ణ మాదిగ పాల్గొనేలా చేశారా? అని పిడమర్తి రవి ప్రశ్నించారు. కనీసం ఎమ్మార్పిఎస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఎప్పుడైనా నిర్వహించారా? అని నిలదీశారు. తాను అంబేద్కర్ కంటే గొప్పవాన్ని అని మందకృష్ణ ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.
పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కావాలా? ముఖ్యమంత్రి కేసీఆన్ ఏర్పాటు చేయనున్న 125 అడుగుల విగ్రహం కావాలో అంబేద్కర్ వాదులు తేల్చుకోవాలన్నారు. మందకృష్ణ చేసే ఏ ఉద్యమమైనా అది స్పాన్సర్డ్ ఉద్యమమేనని పిడమర్తి ధ్వజమెత్తారు. ఒకరి మీద కోపంతో మరొకరితో జట్టుకట్టి ఆందోళనలు చేయడం మందకృష్ణకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ నెల 27 మందకృష్థ ప్రకటించిన ఆందోళన కాంగ్రెస్ పార్టీ చేసిన సమ్మర్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనని పిడమర్తి ఆరోపించారు. మాదిగల ఓట్లను అగ్రకులాలకు అమ్ముకున్న వ్యక్తి మందకృష్ణ అని పిడమర్తి దుయ్యబట్టారు. వర్గీకరణ పేరుతో 1994 నుంచి మందకృష్ణ చేస్తోన్నది ఉద్యమం కాదని, అది ఆయనకు ఉద్యోగంగా మారిందని ధ్వజమెత్తారు.