రాష్ట్రీయం

ప్రయాణికుల సౌకర్యార్థం నూతన రైళ్లు, అదనపు బోగీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఏప్రిల్ 25: ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టడంతో పాటు నూతన రైళ్లు ఏర్పాటు చేసిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి, అలాగే జోన్ మీదుగా కలిపి 10 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారన్నారు. 2018-19లో దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లు, అదనపు రైళ్లు, అదనపు స్టాపేజీల కారణంగా రికార్డు స్థాయిలో అన్ని విభాగాల సమన్వయంతో గత ఏడాది కంటే 8 శాతం ఆదాయం పెరిగి రూ. 4.059 కోట్లకు చేరిందన్నారు. భారతీయ రైల్వేలో సైతం ఈ పెరుగుదల రెండో స్థానంలో నిలిచి, ఉత్తమ పెరుగుదల సాధించిన జోన్‌గా పేరు నమోదు చేసుకుందన్నారు. ఇందులో ప్రధానంగా మూడు ప్రాంతాలకు మూడు ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. లింగంపల్లి - ఇండోర్ హమ్‌సఫర్, నాందేడ్ - జమ్మూతావి హమ్‌సఫర్, అజ్మీర్ - రామేశ్వరం హమ్‌సఫర్ రైళ్లు ప్రధానమైనవని తెలిపారు. అలాగే అవసరమైన ప్రయాణికులకు అదనపు ప్రయోజనం కలిగేలా ఇరువైపులా 30 రైళ్లను వివిధ గమ్యస్థానాలకు విస్తరించినట్లు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న 29 రైళ్లకు పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన 64 బోగీలను జత చేసినట్లు తెలిపారు. దీనికి అదనంగా పలు రైళ్లకు సైతం తాత్కాలిక పద్ధతిన వందలాది బోగీలు జత చేశారన్నారు. ఆదాయ వృద్ధిలో భారతీయ రైల్వేలోనే రెండో జోన్‌గా గుర్తింపు వచ్చిన సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్వా అన్ని విభాగాల వారిని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.