రాష్ట్రీయం

క్రీడారంగంలో పెరిగిన ఉద్యోగావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: క్రీడారంగంలో ఉద్యోగావకాశాలు గత ఐదేళ్లలో 70 శాతం వృద్ధిరేటు నమోదైందని ఇండీడ్ ఇండియా జాబ్ సైట్ ఎండీ శశికుమార్ చెప్పారు. ఈ ఉద్యోగాలు కర్నాటక, మహారాష్ట్ర, న్యూఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయన్నారు. మొత్తం ఉద్యోగాల్లో 50 శాతం ఈ రాష్ట్రాల నుంచి ఉన్నట్లు ఆయన చెప్పారు. స్టోర్ట్స్ ఫిజియోథెరపిస్టు, స్పోర్ట్స్ మేనేజర్, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్, స్పోర్ట్స్ అనలిస్టు, కామెంటేటర్స్, క్రీడా జర్నలిస్టు ఉద్యోగాల కల్పన పెరిగిందన్నారు. ఈ రంగంలో కర్నాటక వాటా 19 శాతం, మహారాష్ట్ర నుంచి 19 శాతం, న్యూఢిల్లీ నుంచి 13, హర్యానా నుంచి 9 శాతం, తమిళనాడు నుంచి 7 శాతం, తెలంగాణ వాటా 6 శాతం, ఉత్తరప్రదేశ్ నుంచి ఐదు శాతం, గుజరాత్ నుంచి 4 శాతం, పంజాబ్ నుంచి 3 శాతం, పశ్చిమబెంగాల్ నుంచి రెండు శాతం ఉద్యోగాల కల్పన నమోదైంది. 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న యువకులు ఎక్కువగా ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తిని కనపరిచారు. ఆ తర్వాత 25-30 సంవత్సరాల మధ్య యువకులు క్రీడా రంగంలో ఉద్యోగాల కల్పన మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో అభ్యర్థులకు సరైన శిక్షణ ఇచ్చేందుకు తగిన వౌలిక సదుపాయాలతో కూడిన సంస్థల ఏర్పాటుకు తగిన అవకాశాలు ఉన్నాయన్నారు.