రాష్ట్రీయం

జిల్లా కేంద్రాల్లో శాశ్వత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: పేదల న్యాయ ప్రయోజనాలకు లోక్ అదాలత్‌లు కీలకమని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. సదస్సులో మాట్లాడుతూ లోక్ అదాలత్‌లతో ఇరు పక్షాలకు వివాదరహిత సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో లోక్ అదాలత్ కోసం శాశ్వత భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. పెండింగ్ కేసులతో ఒత్తిడికి గురవుతున్న న్యాయస్థానాలు, లోక్ అదాలత్‌తో ఉపశమనం పొందుతున్నాయన్నారు. ప్రజలకు సత్వర న్యాయం కోసం హైకోర్టు చేసే ఆలోచనల అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉచితంగా పేదలకు న్యాయ సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ న్యాయం పొందకుండా ఉండకూడదన్నారు. లోక్ అదాలత్ అనేది పురాతన భారతీయ సంప్రదాయం నుంచి పుట్టిన విధానమని, పెద్దల వద్ద వివాదాలు పరిష్కారం చేసుకునే వారని గుర్తు చేశారు. రాజీకి కోర్టు ఫీజు అవసరం లేదు, ఇబ్బందులూ ఉండవన్నారు. తెలంగాణ ప్రభుత్వం పీపుల్స్ ప్రెండ్లీ ప్రభుత్వమని, వివాదాలకు ఆస్కారం లేకుండా చూస్తుందన్నారు. రాజీ మార్గంలో కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. లీగల్ అథారిటీ సెల్‌కు కావలసిన సౌకర్యాలు సమకూర్చనున్నట్టు ప్రకటించారు.