రాష్ట్రీయం

ఏపి ఎంసెట్‌కు పటిష్ఠ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 9: ఏపి ఎంసెట్-2016 నిర్వహణకు ఈ ఏడాది పటిష్ఠమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ దఫా రెవెన్యూ అధికారులను కూడా ఎన్నికల పరిశీలకులుగా నియమిస్తున్నారు. ఈనెల 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్‌లో గల ఆయా రీజనల్ సెంటర్లలో ఎపి ఎంసెట్ నిర్వహించనున్నారు. గతంలో ఎంసెట్ నిర్వహణపై వచ్చిన ఆరోపణలు, అవకతవకలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఎంసెట్ ఫలితాలను మే 9న వెల్లడించనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 22 రీజనల్ సెంటర్లు, హైదరాబాద్‌లో 2 సెంటర్లు మొత్తం 24 రీజనల్ సెంటర్ల పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ప్రతి కేంద్రంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా జామర్లు ఏర్పాటు చేస్తామన్నారు. గత మూడేళ్ళుగా వరుసగా మెడిసిన్ పరీక్షకు హాజరవుతున్న ఆయా జిల్లాలకు చెందిన విద్యార్థుల జాబితాను ఇంటెలిజెన్స్ అధికారులకు అందజేశామన్నారు. వరుసగా పరీక్షలకు హాజరవుతున్న కొందరు విద్యార్థులపై అనుమానం ఉన్నందున ఇంటెలిజెన్స్ వారి జాబితాను సేకరించి, వారి వివరాలను సేకరించే పనిలో ఉందన్నారు. ర్యాంకులు వచ్చినా, రాకున్నా వీరు ఏ కారణంగా పరీక్షలకు హాజరవుతున్నారన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారని, గతంలో ఎంసెట్‌కు హాజరై మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారి వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారని వివరించారు. పరీక్షా కేంద్రంలోకి హాల్‌టిక్కెట్, పెన్నులు, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రాలను (ఎస్సీ ఎస్టీలైతే) మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఎంసెట్‌పై సందేహాల నివృత్తికి 18004256755 టోల్‌ఫ్రీ నెంబర్‌లో సంప్రదించవచ్చని డాక్టర్ సాయిబాబు సూచించారు.