జాతీయ వార్తలు

తెలుగు భాషను ఎవరూ విభజించలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: సమైక్య రాష్ట్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడగొడుతూ చట్టం చేశారే కాని తెలుగు భాషను ఎవ్వరూ విభజించలేరని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ 28వ ఉగాది సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారం మాలవంకర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా అవి ఒకే సెల్‌ఫోన్‌లో రెండు సిమ్‌కార్డుల వంటివని ఆయన చమత్కరించారు. 2020 నాటికి ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న దేశం భారత్ అవుతుందని, భారత్‌లో అత్యధిక యువత తెలుగు రాష్ట్రాల్లో ఉంటారని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని, తెలుగు యువతకు మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో ఐటి జెండా ఎగురవేసింది తెలుగు వారేనని, తెలుగువారు తెలివిగలవాళ్లు అని ప్రపంచం గుర్తించిందన్నారు. తెలుగు వారు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. తాను గవర్నర్‌గా మహారాష్టక్రు వెళ్లితే అక్కడ తెలుగు వారు వేలాది మంది తనకు ఆహ్వానం పలికారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ సాంస్కృతిక ఉత్సవాలకు పెద్ద ఎత్తున తెలుగువారు హాజరయ్యారు.