రాష్ట్రీయం

ఐదింటిపై కేసీఆర్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: తెలంగాణలో ఐదు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ రూపురేఖలను మార్చే ఈ ఐదు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, అనుమతులు తెచ్చేందుకు అవసరమైన నివేదికలను రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా చేసింది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే చకాచకా పావులు కదిపి పలు ప్రాజెక్టులను తేవాలని రాష్ట్రప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేసింది. కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేందుకు కేంద్రంపై వత్తిడి పెంచాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను విభజనలో భాగంగా కల్పించిన విషయం విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా సాలీనా 240 టీఎంసీకిపైగా గోదావరి జలాలలతో తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలను సాగు చేయనున్నారు. ప్రజల దాహార్తిని తీర్చనున్నారు. ఈప్రాజెక్టుపై ఇప్పటికే పలు నివేదికలను కేంద్రానికి గత ఐదేళ్లుగా రాష్ట్ర సర్కార్ పంపుతోంది. మే 23వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నట్లుగా రాజకీయ సమీకరణలు కలిసివస్తే ఈ ప్రాజెక్టులకు అనుమతులు రావడమే కాకుండా తెలంగాణకు మహర్దశ పట్టనుంది. తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం మంజూరుచేసింది. కాని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనువైన నగరమని కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టును తీసుకువచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 50 వేల ఎకరాలను ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. దాదాపు రూ.13వేల కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చవుతుంది. మూడులక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వస్తాయని అంచనఅ. 15 లక్షల మందికి నేరుగా, 54 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. రాష్ట్రప్రభుత్వం సచివాలయాన్ని బైసన్‌పోలోమైదానంలో నిర్మించాలనే సంకల్పంతో ఉంది. దీనికి రక్షణ శాఖ అనుమతులు కావాలి. ఎన్డీఏసర్కార్ అనుమతులు ఇస్తామని ఇదిగో, అదుకో అంటూ ఊరించింది. కాని రక్షణ శాఖ మాత్రం అనుమతులు ఇవ్వలేదు. ప్రత్యామ్నాయంగా స్థలం ఇస్తామని ప్రభుత్వం ఆఫర్‌చేసినా స్పందన లేదు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కచ్చితంగా బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో సచివాలయం నిర్మాణంపై కేంద్రంపై వత్తిడి తెచ్చి సాధించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రక్షణ శాఖ అనుమతుల్లో జాప్యం వల్ల నలుగుతోంది. సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వరకు లక్షలాది వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ఇరుకుగా తయారైంది. వెడల్పు చేయాలంటే రక్షణ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వైఎస్ హయాం నుంచి పెండింగ్‌లో ఉంది. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి శామీర్ పేట వరకు నాలుగులైన్ల ఫ్లైవోవర్ నిర్మాణం ఒక్కటే పరిష్కారమని రహదారులు నిపుణులు తేల్చిచెప్పారు. ఈ ఫ్లైవోవర్ నిర్మించాలంటే రక్షణ శాఖకు చెందిన వంద ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దీనికి కూడా ఆ శాఖ అభ్యంతరం చెబుతుండడంతో కరీంనగర్‌కు, రామగుండం, నిజామాబాద్, నాగ్‌పూర్‌కు వెళ్లే రహదారులు జామ్ అవుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ 330 కి.మీ పొడువున రీజనల్ రింగ్ రోడ్డునిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చినా నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సవాలుగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు, అనుమతులపై కేంద్రంపై వత్తిడి తేనున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల డిమాండ్ మేరకు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్నికోరనున్నారు. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల నివేదికలను సిద్ధం చేశారు.