రాష్ట్రీయం

మిషన్ భగీరథ భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని కేంద్ర మంచినీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ ప్రశంసించారు. ఈ పథకంతో తెలంగాణలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టేనని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో మంచినీటి సరఫరా కోసం చేపట్టిన పథకాలను అధ్యయనం చేయడానికి వచ్చిన రాజశేఖర్ నేతృత్వంలోని కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. రాష్టవ్య్రాప్తంగా మూడు రోజుల పాటు పర్యటించనున్న ఈ బృందం మొదటి రోజు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో ల పర్యటించి హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధ్యయనంపై రాజశేఖర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్టవ్య్రాప్తంగా ఇంటికి మంచినీటిని అందించడం సామాన్యమైన విషయం కాదన్నారు. అధికారులు ఎంతో శ్రమకోర్చి ప్రతిష్ఠాకరమైన పథకాన్ని పూర్తి చేశారని అభినందించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాల గ్రామంలో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని బృందం పరిశీలించింది. అక్కడి నుంచి శుద్ధి చేసిన నీటిని కేతిరెడ్డిపల్లి, నందారం గ్రామాలకు సరఫరా చేసే విధానాన్ని పరిశీలించినట్టు రాజశేఖర్ తెలిపారు. నీటి నాణ్యత, సరఫరా వేళలపై గ్రామస్తులను అడిగి తెలుసుకోగా భగీరథ నీళ్లు వచ్చాక తమ మంచినీటి కష్టాలు తీరాయని చెప్పినట్టు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కమ్మదనం నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని కూడా బృందం పరిశీలించినట్టు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నీటి సరఫరా జరుగుతున్న బలిజరాల తండాను కూడా సందర్శించి గ్రామస్తుల అభిప్రాయలను సేకరించగా వారు కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టు రాజశేఖర్ తెలిపారు.
చిత్రం...మిషన్ భగీరథ పథకాన్ని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కేంద్ర బృందం