రాష్ట్రీయం

తెలంగాణ హైకోర్టులో తొలి మహిళా జడ్జిగా శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జస్టిస్ శ్రీదేవితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్ శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలె శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్టప్రతి ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన జస్టిస్ శ్రీదేవి, ఉత్తర ప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీసుకు అఖిల భారత కోటాలో ఎంపికయ్యారు. అక్కడే వివిధ హోదాల్లో పనిచేసి అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు. ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇటీవలె తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆమె అలహాబాద్ హైకోర్టు సీజే ద్వారా సుప్రీంకోర్టును కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం ఆమె బదిలీకి సిఫార్సు చేసింది. దాంతో కేంద్రప్రభుత్వం సైతం ఆమె బదిలీకి ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చింది.

చిత్రం...తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి