రాష్ట్రీయం

మలేషియా ఏజెంట్ చెరలో నలుగురు బందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఉద్యోగాల పేరుతో నలుగురు యువకులను మలేషియాకు తీసుకువెళ్లి వారిని బందీలుగా మార్చుకున్న ఏజెంట్‌ను అరెస్టు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వైకాపా రాజ్యసభ ఏంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. విశాఖకు చెందిన యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, వారి నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్న ఏజెంట్ ధనశేఖర్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఆయన మంత్రికి పంపిన లేఖలో కోరారు. యువకుల పాస్‌పోర్టులను ఏజెంట్ లాక్కొని బందీలుగా చేశాడన్నారు. యువకులు అందరూ విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలానికి చెందిన వారన్నారు. పదవ తరగతి పాస్ అయిన ఆ యువకులు ఆర్థికంగా వెనుకబడిన కారణంగా జీవనోపాధి కోసం మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో ఏజెంట్‌తో అక్కడికి వెళ్ళారు. బందీలుగా ఉన్న యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని విజయసాయిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.