రాష్ట్రీయం

యాదాద్రిలో ఘనంగా నృసింహ జయంత్యుత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 15: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు బుధవారం కొండపైన బాల ఆలయంలో, పాతగుట్ట ఆలయంలో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. బాల ఆలయంలో ఉదయం 9గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనంతో పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం జయంతి ఉత్సవాలు అర్చక, వైదిక రుత్విక బృందం ఆరంభించింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 10:30లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించి తిరువేంకటపతి అలంకార కొలువుదీర్చి బాల ఆలయంలో పల్లకి సేవ నిర్వహించారు. రాత్రి పర వాసుదేవ అలంకార సేవలో గరుడవాహనంపై స్వామివారిని ఊరేగించారు. సకల పాపాలను హరించివేసే వెంకటాపతి అలంకార సేవలో, వైకుంఠధాముడైన పరవాసుదేవ అలంకార సేవలో ఊరేగిన స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు.
ఇక బెల్లం లడ్డూలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో బుధవారం నుండి భక్తులకు బెల్లం పానకంతో తయారుచేసిన ప్రసాద లడ్డూల విక్రయాన్ని ప్రారంభించారు. వంద గ్రాముల ఒక లడ్డూను 25 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. చక్కెర పానకంతో తయారుచేసే లడ్డూ కంటే బెల్లం లడ్డూకు ఐదు రూపాయల అదనంగా ధర నిర్ణయించారు. విక్రయానికి ముందు తొలి లడ్డూ ప్రసాదాలను బాల ఆలయంలో స్వామివారికి నివేదన చేసి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌కు అందించారు. అనంతరం లడ్డూ విక్రయ కౌంటర్లలో బెల్లం లడ్డూల విక్రయాన్ని ప్రారంభించారు.