రాష్ట్రీయం

తడారిపోయంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఎండిపోయిన బోర్లు.. పాతాళానికి దిగజారిన భూగర్భ జల మట్టాలతో దర్శనమిస్తున్న తెలంగాణ పట్టణాలు, పల్లెలు, తండాల్లో మళ్లీ జలకళ ఉట్టి పడాలంటే మూడేళ్లు పట్టేలా ఉంది. వరుసగా వచ్చే మూడేళ్లు వర్షాలు పడితేకాని భూగర్భ జల మట్టాలు రీచార్జీ అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు ఆందోళనకరస్థాయిలో పడిపోయాయి. 10 జిల్లాల్లో 27802 గ్రామీణ ఆవాసాల్లో 7480 గ్రామాలకు మాత్రమే వందశాతం మంచినీటి సదుపాయం ఉండగా, మిగిలిన గ్రామీణ ఆవాసాలు గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రూ.329 కోట్ల నిధులు విడుదల చేసింది. జిహెచ్‌ఎంసికి రూ.60 కోట్ల నిధులిచ్చింది. కాని ప్రజల దాహార్తి మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూగర్భ జల వనరుల పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని కోరినట్లు సిఎస్‌ఐఆర్ భారత భూభౌగోళిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్తవ్రేత్త షకీల్ అహ్మద్ చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాల్లో ఐదు జిల్లాలు తీవ్రమైన కరవుతో అల్లాడుతున్నాయన్నారు. అన్నిరకాల నీటి వనరులు ఎండిపోయాయి. భూగర్భ జల మట్టాలు కనీవినీ ఎరుగని విధంగా లోతుల్లోకి జారుకున్నాయి. సరిగా వర్షాలు కురవకపోవడం, ఇష్టం వచ్చినట్లు గొట్టపుబావులు తవ్వడం, నీరు, చెట్టు, భూమి (వాల్టా) చట్టాన్ని ఉల్లంఘించడం కూడా నీటి కరవుకు కారణమన్నారు. హైదరాబాద్‌లో వాల్టా చట్టం ఉల్లంఘనలు యథేచ్చగా జరుగుతున్నాయి. వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సి ఉందని, ప్రైవేట్ కాంట్రాక్టర్లు బోర్లు తవ్వడాన్ని నిషేధించాలన్నారు. చట్టపరమైన అనుమతులు ఉంటేనే బోర్లు డ్రిల్లింగ్ చేసే అధికారం ఎంపిక చేసిన సంస్థలకు ఇవ్వాలన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో రాయలసీమలో ఒక్కటే నీటి సమస్య ఉందన్నారు.
ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖ జాయింట్ డైరెక్టర్ కె ధనుంజయ్ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లు వరుసగా వర్షాలు కురిస్తే తప్ప భూగర్భ జలవనరుల పరిస్థితి తేరుకోదన్నారు. మహబూబ్‌నగర్‌లో గత ఏడాదిలో భూగర్భ జలాలు 4.5 మీటర్లు లోతుకు పడిపోయాయి. తెలంగాణలో సగటు భూగర్భ జల మట్టం 10.53 మీటర్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 14.7 మీటర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గొట్టవుబావులు ఎక్కడ తవ్వితే బాగుంటుందో వివరాలు కావాలని, శాస్ర్తియమైన నివేదిక ఇవ్వాలని ఎన్‌జిఆర్‌ఐను కోరింది. ఎన్‌జిఆర్‌ఐ శాస్తవ్రేత్తలు ఆదిలాబాద్ నుంచి నివేదికకు అవసరమైన శాస్ర్తియమైన సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా మంచి నీటి వనరులు కనుగొంటామని ఎన్‌జిఆర్‌ఐ ప్రధాన శాస్తవ్రేత్త షకీల్ అహ్మద్ తెలిపారు.
నారాయణఖేడ్‌లో ఎండిపోయిన 1200 బోర్లు
మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం దాదాపు 1200 బోర్లు ఎండిపోయాయి. దీంతో గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ 350 బోరువెల్స్‌ను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేస్తోంది. దురదృష్టమేమిటంటే, ఇందులోనూ వంద బోర్లు ఎండిపోయాయి. మిగిలిన బోర్లలో నీటి మట్టం పడిపోతోంది. కొన్నిచోట్ల 12 గంటల వరకు నీటిని తోడేందుకు వేచిచూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా జీవనది మంజీరా కూడా వర్షాభావ పరిస్ధితుల వల్ల ఎండిపోయింది. ఇది కూడా పరీవాహక ప్రాంతంలో బోర్లు ఎండిపోవడానికి కారణమని ఎన్‌జిఆర్‌ఐ శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
నీటి వనరుల దోపిడీ నిరోధక చట్టం తేనున్న కేంద్రం
భూగర్భ జల వనరులను యథేచ్చగా దోపిడీ చేసే పద్ధతికి చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ అంశంపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు జాతీయ స్ధాయిలో ఒక చట్టాన్ని రూపొందిస్తున్నామని, అభిప్రాయాలు తెలియచేయాలని విధానపత్రాన్ని పంపింది. ఒక నమూనా బిల్లును పార్లమెంటులో ఆమోదించి, ఆ తరహాలో రాష్ట్రప్రభుత్వాలు చట్టాలు చేయాల్సి ఉంటుంది. జలవనరులు రాష్ట్రం పరిధిలోకి వచ్చే అంశమైనందు వల్ల కేంద్రం ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకుంటోంది. త్వరలో హైదరాబాద్‌లోనే జాతీయ భూగర్భ మంచినీటి వనరుల వినియోగంపై సదస్సు జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర జల వనురల శాఖ కార్యదర్శి శశి శేఖర్ చెప్పారు. దేశంలోని గ్రామీణులు 85 శాతం నీటి కోసం బావుల పై ఆధారపడుతున్నారన్నారు. ఇప్పటికీ పట్టణాల్లో 48 శాతం మంది భూగర్భజలవనులపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. దేశంలోని 60 శాతం జిల్లాల్లో భూగర్భ జల వనరుల కాలుష్యమయ్యాయని, దీనిని అరికట్టేందుకు రాష్ట్రాలు చట్టాలను కఠినంగా అమలు చేయడం లేదన్నారు.