రాష్ట్రీయం

మావోల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 15 తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సుదీర్ఘ విరామం అనంతరం విస్తరణ దిశగా మావోయిస్టులు అడుగులు వేస్తున్నారు. ఉద్యమ బలోపేతంలో భాగంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి చెందిన విద్యార్థులను చత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ శిక్షణ ఇప్పించి యూనివర్సిటీలలో సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణలో మళ్లీ పట్టుకోసం మావోయిస్టులు నడుం బిగించి ఉద్యమ ఉద్ధృతికి శ్రీకారం చుట్టారు. ఇందుకు ఆర్థికంగా చేయూతనందించేందుకు భారీగా నిధులు శాతవాహన యూనివర్సిటీకి చేరాయన్న సమాచారం అందగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీస్ యంత్రాంగంతో పాటు ఇంటెలిజెన్సీ ఐజీ, స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీయడం ఆరంభించారు. మావోలు మళ్లీ బలపడేందుకే యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. నక్సలైట్ల కార్యకలాపాల విస్తరణ కోసం అనుబంధంగా తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యత్వాల నమోదును ముమ్మరం చేసినట్టు గుర్తించారు. విద్యార్థి హక్కుల పోరాట వేదిక పేరుతో మరింత బలపడేందుకు తెలంగాణ అన్ని యూనివర్సిటీలలో మావోయిస్టుల ప్రాబల్యం పెంపుకోసం కావాల్సిన ఆర్థిక వనరులను భారీగా సమకూరుస్తున్నట్టు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయ. చాపకింద నీరులా యూనివర్సిటీలో సాగిపోతున్న మావోయిస్టుల ఉద్యమాన్ని ఆదిలోనే గుర్తించకపోవడంతో కొంత బలం పుంజుకున్న వారిని బలగాలతో కట్టడి చేయవచ్చన్న సమాలోచనతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం.
టీవీవీ విద్యార్థి వేదికగా చేసుకుని ఉద్యమ బలోపేతం దిశగా నక్సల్స్ విస్తరణకు శ్రీకారం చుట్టినట్టు ఆలస్యంగా గుర్తించామని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు కొందరిని తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) పేర చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యానికి తీసుకెళ్లి మావోల అధినేతను కలిసి అవసరమైన నిధులు సమకూర్చగా కరీంనగర్‌కు ఆ నిధులు చేరినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. విద్యార్థులకు మావోల అనుబంధ సంస్థ అని చెప్పకుండా విద్యార్థి పోరాట హక్కుల వేదిక పేర ఉమ్మడి జిల్లాలో పలు విద్యాసంస్థలకు ఇతర జిల్లాల్లోని విద్యాలయాలకు వెళ్లి సభ్యత్వాలు చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.
మావోల మాటలు, పాటలకు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లి అనేక మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఒక్కసారి పునరాలోచించాలంటూ పోలీసు శాఖ ప్రచారాన్ని చేపట్టింది. గత దశాబ్ద కాలం నుంచి ప్రశాంతంగా ఉన్న పచ్చని పల్లెల్లో మళ్లీ అశాంతి సెగలు రగిలే అవకాశాలు ఉన్నాయని, మావోల హింసాత్మక చర్యలకు చెక్ పెట్టేందుకు పోలీస్ యంత్రాంగం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతోంది. విద్యార్థులు సభ్యత్వాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి, తెలంగాణలో మళ్లీ రక్తపుటేరులు పారే ప్రమాదం ఉందని, యూనివర్సిటీలలో అధ్యాపకులే కొందరు విద్యార్థులను చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యానికి తీసుకెళ్లి మావోయిస్టులతో చేతులు కలిపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసే ప్రయత్నాలు ముమ్మరం చేయడం విచారకరమని పోలీసులు వెల్లడిస్తున్నారు.
అన్నలకు అనుబంధంగా ఉన్న సంస్థలు, సంఘాల్లో చేరి ఉజ్వల భవిష్యత్‌ను చేజేతులారా నాశనం చేసుకోవద్దని, తమ పిల్లలు ఎటువైపు పయనిస్తున్నారో తల్లిదండ్రులు సైతం నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ బలోపేతంలో భాగంగా మావోల కదలికలపై పోలీస్ యంత్రాంగం ఆరా తీయడంతో పాటు పటిష్టమైన నిఘా నియంత్రణ చర్యలు చేపడుతోంది. ఆ దిశగా విచారణ కొనసాగిస్తూనే నగరం నడిబొడ్డున కరీంనగర్‌లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల ప్రతి కదలికపై రెప్పవాల్చకుండా డేగకళ్లతో పోలీస్ నిఘా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా టీవీవీకి వ్యతిరేకంగా నక్సల్స్ బాధితుల సంక్షేమ సంఘం పేర యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మావోయిస్టులతో సంబంధాలు కలిగిన విద్యార్థులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.