రాష్ట్రీయం

జూలై నుంచే కాళేశ్వరం నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం మరో నెలన్నరలో సాకారం కాబోతోంది. గోదావరి జలాలతో తెలంగాణ బీడు భూములు సస్యశ్యామలమయ్యే సమయం ఆసన్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతల వచ్చే నెలన్నర రోజుల్లో జూలై నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. జూలై నుంచి గోదావరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులోకి రోజుకు రెండు టీఎంసీలు, వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినట్టు సీఎం చెప్పారు. ఇక నుంచి ప్రతీ ఏడాది దాదాపు 540 నుంచి 600 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీటి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. జూలై నుంచి నీటి ప్రారంభించే నీటి పోతలకు అవసరమైన 3800 మెగావాట్ల విద్యుత్, వచ్చే ఏడాది నాటికి మొత్తంగా 6100 మెగావాట్ల విద్యుత్ అందించడానికి ఏర్పాటు చేయాల్సిందిగా విద్యుత్ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసే అంశంపై ప్రగతి భవన్‌లో గురువారం సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల నీటి ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. అలాగే ఎత్తిపోతల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. పంపుల ట్రయల్ రన్లు కూడా విజయవంతమయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచి నీటిని ఎత్తిపోయాలి. దీని కోసం 3800 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. గోదావరిలో తెలంగాణ వాటా నీటిని పూర్తిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. నీటి లభ్యత కూడా మేడిగడ్డ ఉంది. మేడిగడ్డ నుంచి మరో టీఎంసీని కూడా ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాం. దీని కోసం 6100 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. గోదావరిలో నీటి ప్రవాహం ఉండే జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుంది. జూన్ నుంచి నవంబర్ వరకు రోజుకు 2 టీఎంసీలు, జూలై నుంచి అక్టోబర్ వరకు రోజుకు 3 టీఎంసీల నీటి ఎత్తిపోయవచ్చు. డిసెంబర్ నెలలో కూడా ఒక ఎత్తిపోతల పంపును నడిపి నీరు తీసుకోవచ్చు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవచ్చు. దానికి ఎంత విద్యుత్ అవసరం అవుతుందో శాస్ర్తియంగా అధ్యయనం చేయాలి. అవసరమైన మేరకు విద్యుత్ సరఫరాకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయానికి మాత్రమే కాకుండా మంచినీటికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని గోదావరి నుంచే తీసుకోవాలన్నారు. గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉందన్నారు. ఈ నీటిని వినియోగించుకోవడానికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో కూడా ఒప్పందం చేసుకున్నామన్నారు. సీడబ్ల్యుసి లెక్కల ప్రకారం మేడిగడ్డ వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉందన్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత వరకు నీటిని ఎత్తిపోయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి వరకు అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోయాలన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఒక టీఎంసీని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, మరో టీఎంసీని మల్లన్నసాగర్ వరకు ఎత్తిపోయాలన్నారు. అలాగే వచ్చే ఏడాది ఎల్లంపల్లి వరకు మూడు టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ వరకు రెండు టీఎంసీల నీటిని తరలించి రిజర్వాయర్లు, చెరువులు నింపాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన 22 లక్షల ఎకరాలకు మాత్రమే కాకుండా శ్రీరాంసాగర్ ఆయకట్టుకు, గుత్ప అలీసాగర్ ఆయకట్టుకు, నిర్మల్-ముధోల్ నియోజకవర్గాలకు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించాలన్నారు. మొత్తంగా ఏడాదికి 90 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు వెల్లిబుచ్చే అభిప్రాయాలు పూర్తిగా అవగాహన రాహిత్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు.
18న రామగుండం, 19న కాళేశ్వరం
ఈ నెల 18, 19 తేదీలలో రామగుండం, కాళేశ్వరంలో పర్యటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 18న రామగుండంలో నిర్మాణంలో ఉన్న 1600 మేగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను సందర్శిస్తారు. అలాగే అక్కడ ఎన్‌టిపీసీ, జన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 19 ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహించి, ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.