నటుడు రాళ్లపల్లి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహరావు (64) కన్ను మూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1979లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి, శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానకి సంకెళ్లు, ఏప్రిల్ 1 విడుదల, సూర్య, ఐపీఎస్, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ, భలే భలే మగాడివాయ్ వంటి దాదాపు 850 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినీపరిశ్రమకు ఆయన సేవలు అందించారు. తూర్పుగోదావరి జిల్లా రచపల్లిలో 1955 అక్టోబర్ 10న జన్మించిన రాళ్లపల్లికి విద్యార్థి దశ నుండే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1979లో సినీరంగ ప్రవేశం చేశారు. కేవలం హాస్యనటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలక్షణ నటుడిని కోల్పోయినందుకు సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాళ్లపల్లి పార్థీవ దేహాన్ని ఆస్పత్రి నుండి మోతీనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అనేక మంది సినీ ప్రముఖులు రాళ్లపల్లి నివాసానికి చేరుకుని తమ తీవ్ర దిగ్భ్రాంతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపల్లి అంతిమ సంస్కారం శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

నటుడు రాళ్లపల్లి (ఫైల్‌ఫొటో)