రాష్ట్రీయం

‘పవర్’ పరుగుతీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మే 18: ‘మన లక్ష్యం... మన సంకల్పం... పరిపూర్ణంగా నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అవసరం బాగా ఉంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పనుల్లో మరింత వేగాన్ని పెంచాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం పనుల వ్యవహారంలో ఎక్కడా, ఏ మాత్రం జాప్యం లేకుండా పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో వేల కోట్ల రూపాయలతో నిర్మాణమవుతున్న తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పనులను ముఖ్యమంత్రి కెసీ ఆర్ పరిశీలించారు. ప్రాజెక్ట్‌కు చేరుకోగానే ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వాగతం పలికారు. ప్రాజెక్ట్ నిర్మాణ స్థలి వద్ద వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. మ్యాప్ ద్వారా తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన సాంకేతిక వివరాలను ఎన్టీపీసీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ వ్యయ అంఛనా వివరాలతోపాటు సాంకేతిక పరమైన వివరాలను కూడా అధికారుల నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటి వరకు పూర్తి చేయగలరని అడిగారు. అనుకున్న సమయాని కంటే ముందుగానే థర్మల్ పనులు పూర్తి చేయాలని, ఎన్టీపీసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా కరెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులను పూర్తిచేయాలన్నారు. ఎంతగా ఆలస్యమైతే మనపై అంతగా భారం పడుతుందని సీఎం అన్నారు. రక్షణతో కూడిన నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రామగుండం ఎన్టీపీసీలో స్వరాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం 1600 మెగవాట్ల సామర్థ్యం గల తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ నిర్మాణం చేపట్టగా వాటి పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ ఇక్కడకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పం కాళేశ్వరం ప్రాజెక్ట్. రాష్ట్రంలోని కోటి ఎకరాల సాగు భూములకు నీరందించాలన్న ప్రధాన సంకల్పంతో, 85,000 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయంతో, ఎప్పుడూ, కనీవినీ ఎరగని రీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తయ్యే దశలోకి తీసుకు వస్తున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు విద్యుత్ అవసరాలు మరింతగా పెరిగాయి. కాగా, కొత్తగా నిర్మితమవుతున్న తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్ పనులను సాంకేతిక పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేసి, ఆదర్శప్రాయంగా నిలవాలని ముఖ్యమంత్రి ఎన్టీపీసీ ఉన్నతాధికారులకు కేసీఆర్ సూచించారు. ఇప్పటి వరకు చేపడుతున్న థర్మల్ నిర్మాణం పనుల్లో ఎలాంటి ఆటంకాలకు తావులేకుండా, ప్రమాదాలకు తావివ్వకుండా పనుల పురోగతికి కృషి చేస్తున్న ఎన్టీపీసీ అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
2020లో థర్మల్ విద్యుత్
తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులను ఫిబ్రవరి 2020 కల్లా మొదటి యూనిట్ పనులను పూర్తి చేసి, ఉత్పత్తి దశలోకి తీసుకువస్తామని ఎన్టీపీసీ ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టం చేశారు. అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో తయారవుతున్న ఈ ప్లాంట్ నిర్మాణం 2016 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. 1,600 మెగవాట్ల సామర్థ్యంతో తెలంగాణ థర్మల్ కేంద్రం పనులు సాగుతున్నాయి. 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను నిర్మాణం జరుపుకుంటుందని, రెండు దశలు ఇక్కడ తెలంగాణ ప్రాజెక్ట్ పనులను పూర్తి దశలోకి తీసుకు వస్తామని, మొదటి యూనిట్ నిర్మాణం ఫిబ్రవరి 2020 నాటికి, అదేవిధంగా అక్టోబర్ వరకు రెండవ యూనిట్ నిర్మాణం మీరు కోరుకున్న విధంగానే అన్ని పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం పర్యటనలో ఎన్టీపీసీ సి అండ్ ఎండి గురుదీప్ సింగ్, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, ఎస్‌కే జోషి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, సింగరేణి సి అండ్ ఎండి శ్రీ్ధర్, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎన్టీపీసీ ఆర్‌ఈడీ దిలీప్ కుమార్ దూబే, ఈడీ కులకర్ణి ఉన్నారు.
చిత్రం... తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్