రాష్ట్రీయం

అండమాన్‌లో నైరుతి రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నైరుతీ రుతుపవనాలు ఈ రోజు అండమాన్, నికోబార్ ద్వీపాల వద్ద అండమాన్ సముద్ర ప్రాంతంలో ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. అండమాన్ సముద్రంలో మేఘాలు అధికం కావడం, వానలు ప్రారంభం కావడం, తుపానుద్రోణి ఏర్పడటంతో రుతుపవనాలు ప్రారంభమైనట్టు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితమే ఐఎండీ ఒక ప్రకటన చేస్తూ, ఈ నెల 18 లేదా 19 వ తేదీల్లో నైరుతీ రుతుపవనాలు అండమాన్ ప్రాంతంలో ప్రారం భం అయ్యేందుకు అవకాశం ఉందని ప్రకటించారు. ఐఎండీ అంచనాలు నిజమయ్యాయి. నైరుతీ రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతంలో ముందుకు కదిలేందుకు వాతావరణ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. ఇలా ఉండగా తెలంగాణలో ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. వడగాడ్పులు అన్న జిల్లాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది.