రాష్ట్రీయం

హరేకృష్ణ ఆలయంలో సీఎం సతీమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భార్య శ్రీమతి శోభ శనివారం ఇక్కడ బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభుజీతో పాటు ఆలయ ప్రతినిధులు వేదపండితులు శోభకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరేకృష్ణ స్వర్ణదేవాలయంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభు క్షేత్రంతో పాటు అనుబంధ ఆలయాలైన రాధాగోవిందుల ఆలయం, పంచాజనే్యశ్వర స్వామి ఆలయం, గరుణ అళ్వావర్ సన్నిధి, జప ఆంజనేయ స్వామి క్షేత్రం , హరేకృష్ణ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీప్రభుపాదుల ఆచార్య పీఠంతో పాటు ప్రతి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు 108 స్వర్ణ పుష్పాలతో అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చిత్రం... సీఎం కేసీఆర్ భార్య శ్రీమతి శోభకు శ్రీలక్ష్మీనరసింహస్వామి
చిత్రపటం ప్రసాదాలు అందిస్తున్న ఆలయ అర్చకులు