రాష్ట్రీయం

కాలుష్య నివారణపై విద్యార్థులకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలుష్య నియంత్రణపై విద్యార్థులకు వివిధ పోటీలను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) నిర్వహిస్తోంది. వాయు/గాలి కాలుష్యంపై చిత్రలేఖనం, క్విజ్, ఎలక్యూషన్ తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయని పిసీబీ తెలియచేసింది. సబ్-జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పీసీబీ పీఆర్‌ఓ తెలిపారు. హైదరాబాద్ (నాంపల్లి)లోని జవహర్ బాలభవన్‌లో ఈ నెల 21 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోటీలు ఉంటాయని వివరించారు. ఈ పోటీల్లో విజేతలకు పర్యావరణ దినోత్సవమైన జూన్ 5 న బహుమతులను పంపిణీ చేస్తామని వివరించారు.