రాష్ట్రీయం

20న తెలంగాణ లాసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణలోని న్యాయ విద్యా కళాశాలల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 20న మూడేళ్ల లాసెట్, ఐదేళ్ల లాసెట్, పీజీఎల్ సెట్‌లను నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈసారి లాసెట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. పరీక్ష ఉదయం 11 గంటల నుండి 12.30 గంటల వరకూ జరుగుతుందని తెలంగాణలో 72 కేంద్రాల్లో, ఆంధ్రాలో నాలుగు కేంద్రాల్లో జరుగుతోందని పేర్కొన్నారు. ఇంగ్లీషు, తెలుగు మాద్యమంలోనూ, ఇంగ్లీషు- ఉర్దూ మీడియంలోనూ ప్రశ్నాపత్రాలను రూపొందించామని అన్నారు. పీజీఎల్‌సెట్ మాత్రం కేవలం ఆంగ్లమాద్యమంలో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్ధులు ఉదయం 9 గంటలకే చేరుకోవాలని, జాప్యం జరిగితే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం జరగదని పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయ విద్యా కళాశాలల్లో మూడేళ్ల యూజీ కోర్సునకు 17498, ఐదేళ్ల కోర్సునకు 5181 దరఖాస్తులు, ఎల్‌ఎల్‌ఎంకు 2280 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీ కోర్సులో 2940 మంది, ఐదేళ్ల యూజీ కోర్సులో 1028, ఎల్‌ఎల్‌ఎంలో 553 సీట్లు ఉన్నాయని అన్ని కోర్సులూ కలిపి 4521 సీట్లు ఉన్నాయని చెప్పారు.