రాష్ట్రీయం

రైతు సమగ్ర సర్వేకు ఎన్నికల ఆటంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వేకు ఎన్నికలు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ నెల 20 వరకు సర్వే పూర్తి చేయాలని భావించినప్పటికీ, అనేక సమస్యలు అడ్డు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23 న, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 27 న నిర్వహిస్తున్నారు. ఈ లెక్కింపులో వ్యవసాయ శాఖ అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నారు. సిబ్బందికి శిక్షణ తదితర కార్యక్రమాల్లో సిబ్బంది బిజీగా ఉన్నారు. మరోవైపు వానాకాలం సీజన్‌కు విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీ బాధ్యత కూడా వ్యవసాయ శాఖకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ), వ్యవసాయ అధికారులపై (ఏఓ) ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కో రైతు నుండి 45 అంశాలను సేకరించి సంబంధిత ఫాంలో నింపాల్సి ఉంటుంది. రైతు పేరు, తండ్రిపేరు, భూమి విస్తీర్ణం, భూమి రకం, ఏ ఏ పంటలు ప్రధానంగా వేస్తున్నారు, నీటి లభ్యత ఎలా ఉంది, మార్కెటింగ్ పరిస్థితి ఏమిటి, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తదితర వివరాలన్నీ ఏఈఓలు సేకరించాల్సి ఉంటుంది. ఒక్కో రైతు నుండి ఇన్ని వివరాలు సేకరించేందుకు చాలా సమయం పడుతోంది.