రాష్ట్రీయం

వైకాపాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ జాతీయ సర్వేల అంచనాల్లో స్పష్టంగా పేర్కొన్నాయి. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తోందని ఎగ్జిట్‌పోల్స్‌లో ఆదివారం పేర్కొన్నాయి. ఇక అధికారం లాంఛన ప్రాయమేనని వెల్లడించాయి. వైఎస్సార్ సీపీ గుర్తు ప్యాన్ గాలి స్పీడుకు సైకిల్ వెనకంజ ఉన్నట్లుగా ఎగ్జిట్‌పోల్స్ చెప్పాయి. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టబోతోందని జాతీయ సర్వేలు తేల్చాయి. అన్ని సర్వేల్లో జనం వైఎస్ జగన్‌వైపు మొగ్గు చూపారని స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టబోతున్నారని సర్వేలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తించాయి. దేశంలో అత్యంత జనాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అంటూ ఎగ్జిట్‌పోల్స్ ఆదివారం ప్రకటించాయి. జగన్ ప్రభంజనంతో ఆంధ్రలో అధికార టీడీపీకి ఘోర పరాజయం తప్పదని సర్వేలు స్పష్టం చేశాయి. కేవలం లగడపాటి రాజగోపాల్‌తో పాటు మరో రెండు సంస్థలు మాత్రమే ఆంధ్రలో మళ్ళీ అధికారంలోకి టీడీపీ వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌లో వచ్చినట్లుగా వెల్లడించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు జాతీయ సర్వేలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 50.1 శాతం ఓట్లుతో వైఎస్సార్ సీపీ ముందంజలో ఉన్నట్లు సర్వేలు ప్రకటించగా, టీడీపీ 40.2 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని, ఇక పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు 7.3 శాతం ఓట్లు, ఇతరులకు 2.6 శాతం ఓట్లు పొందినట్లు సర్వేలు వెల్లడించాయి. ఇతర పార్టీలతో పోల్చితే వైఎస్సార్ సీపీకి దాదపు 10 శాతం అధికంగా ఓట్లు పోలైనట్లు ప్రకటించాయి. దీంతో అధికారం ఖచ్చితంగా జగన్మహనరెడ్డికే దక్కుతుందని ఎక్కువ సర్వే సంస్థలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ స్థాపించిన వైఎస్సార్ సీపీకి 130-135 అసెంబ్లీ, 22- 24 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని సీపీఎస్ సర్వే స్పష్టం కాగా, టీడీపీకి 43- 44 అసెంబ్లీ దక్కవచ్చునని వెల్లడించింది. వీడీపీఏ ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్ సీపీకి 111- 121 అసెంబ్లీ, టీడీపీకి 54-64 అసెంబ్లీ స్థానాలు వస్తాయంది. సీ ఓటుర్ సర్వేలో, ఇండియా టుడే సర్వేలో వైఎస్సార్ సీపీకి 18-20 పార్లమెంట్, అసెంబ్లీ 132-135 స్థానాలు దక్కుతాయని తెల్చింది. కేవలం టీడీపీకి 4-6 పార్లమెంట్, 37-40 అసెంబ్లీ స్థానాల్లో దక్కుతాయని చెప్పింది. జనసేనకు ఒకటి దక్కవచ్చునని చెప్పంది. టైమ్స్‌నౌ సంస్థ వైఎస్సార్ సీపీకి 18 పార్లమెంట్ స్థానాలు, 122 అసెంబ్లీ
స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. న్యూస్-18 చానల్ ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్ సీపీకి 13-14 పార్లమెంట్, 111 అసెంబ్లీ స్థానాలు వస్తాయని వెల్లడించగా, టీడీపీకి 10-12 పార్లమెంట్ స్థానాలు వస్తాయంది. పీపుల్స్ పల్స్ సర్వేలో వైఎస్సార్ సీపీకి 112 అసెంబ్లీ, 18-21 పార్లమెంట్ స్థానాలు, టీడీపీకి అసెంబ్లీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. ఆరా సర్వేలో వైఎస్సార్ సీపీకి 126 అసెంబ్లీ, టీడీపీకి 47 అసెంబ్లీ, జనసేనకు రెండు స్థానాలు వస్తాయంది. లగడపాటి రాజగోపాల్ మాత్రం టీడీపీకి 100 అసెంబ్లీ, 15 పార్లమెంట్ స్థానాలు వస్తాయని, వైఎస్సార్ సీపీకి 72 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు. రెండు పార్టీల మధ్య కేవలం 2 శాతం ఓట్ల తేడా ఉందని లగడపాటి చెప్పారు. జనసేనకు 11 శాతం ఓట్లు రావచ్చునని అంచనా వేశారు.