రాష్ట్రీయం

చక్రస్నానంతో ముగిసిన గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 19: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు వేడుకగా జరిగిన బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం నిర్వహించిన చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం 6 గంటలకు గోవిందరాజ స్వామివారు, చక్రత్తాళ్వార్‌లు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు పట్టారు. ఆలయ ఆవరణలో స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం కపిలతీర్థం పుష్కరిణిలో వేద మంత్రోచ్ఛరణల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. అనంతరం టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న పీఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారు పిఆర్ తోట నుంచి ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9.10 నుంచి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు జ్ఞానప్రకాష్, శ్రీహరి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
చిత్రం...శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రతాళ్వార్‌కు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు