రాష్ట్రీయం

అనుమానం లేదు.. మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 20: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లో సర్వేలు సహజం.. ఇదో అలవాటుగా మారింది.. పత్రికలు..పార్టీలు అన్నీ సర్వేలు చేస్తున్నాయి.. గత 33 ఏళ్లుగా సర్వేలు నిర్వహిస్తున్నాం.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నూటికి వెయ్యిశాతం అధికారంలోకి రావడం ఖాయం.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తెలుసుకోవటం ఒక పని కాగా అభివృద్ధి, సంక్షేమం స్పందన మరో రకంగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల రోజున తాను ఇచ్చిన పిలుపు మేరకే ఓటర్లు స్పందించారని గుర్తుచేశారు. మరుసటి రోజు తెల్లవారుజాము వరకు సహనంతో ఓటేశారని పునరుద్ఘాటించారు. తమ పార్టీ మొదటి నుంచి సిద్ధాంతపరంగానే పోరాడుతుందని ఉద్ఘాటించారు. టెక్నాలజీకి మనం మాస్టర్ కావాలి కానీ.. మనం బలిపశువులు కాకూడదని వ్యాఖ్యానించారు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు ఇప్పుడున్న వ్యవస్థను మార్చాల్సిన పని ఉండదన్నారు. ప్రపంచంలోనే ఇదో నమూనాగా, పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. దీనివల్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చా వేదికలో సైతం ఎన్నికల సంఘం మాజీ కమిషనర్లు ఇదే విషయాన్ని స్పష్టంచేశారని గుర్తుచేశారు. పారదర్శకతకే ప్రజాస్వామ్యంలో పెద్దపీట వేయాలన్నారు. ప్రజల్లో అనుమానాలకు తావివ్వకుండా విశ్వసనీయత పెంచాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందన్నారు. 2013లో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి సదాశివం తీర్పును చంద్రబాబు ప్రస్తుతించారు. ఓటరుకి తాను వేసిన ఓటు అనుకున్న వాళ్లకు పడిందా.. లేదా.. తెలుసుకునే హక్కు ఉందన్నారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగాయనేందుకు ఇది తప్పనిసరన్నారు. పారదర్శకత ద్వారా ఓటరులో విశ్వాసం కల్పించే రీతిలో ఈవీఎంలకు వీవీ ప్యాట్లు జత చేయటం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో గణనీయమైన పాత్ర వహిస్తాయని జస్టిస్ సదాశివం తీర్పును వివరించారు. ‘విశ్వసనీయతకు, వెసులుబాటుకు మధ్యన ఎంచుకోవాలని అనుకున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని వాటిపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవటానికి ఇబ్బంది అయినప్పటికీ విశ్వసనీయత కోసం అదనపు ప్రయత్నం చేయటం అవసరమ’ని అమెరికా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అమలు చేయనందునే దేశంలోని 23 రాజకీయ పార్టీలు ఉమ్మడి పోరాటాన్ని ప్రారంభించాయని తెలిపారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలనే డిమాండ్‌తో సుప్రీంను ఆశ్రయించామని, అయితే ఎన్నికల సంఘం దీన్ని వ్యతిరేకిస్తూ ఆరు రోజుల సమయం పడుతుందనే వాదనలు వినిపిస్తోందన్నారు. ఈ వాదననే 23 పార్టీలతో సహా ఎన్నికల అధికారులు సైతం తప్పుపడుతున్నారని స్పష్టం చేశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నాయన్నారు. నోటిఫికేషన్ వెలువడి నప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేదార్‌నాథ్ ధ్యానం వరకు అన్ని అంశాల్లో ఈసీ వ్యవహారశైలిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో 66.39 శాతం పోలింగ్ నమోదు కాగా ఏపీలో 89శాతం పోలింగ్ జరిగిందని, అవసరం ఉన్నప్పుడు కేంద్ర బలగాలను పంపకుండా ఇప్పుడు పంపటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ల లెక్కింపు వల్ల బీజేపీకి వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. ఇతర పార్టీలు వీటిపై ఎందుకు ముందుకు రావటంలేదో చెప్పాలన్నారు. ఎవరు కలిసొచ్చినా..రాకపోయినా ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదన్నారు. వీవీ ప్యాట్ల కోసం రూ 9 వేల కోట్లు ఖర్చుపెట్టారని ఇది అలంకార ప్రాయం కారాదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 73 రోజులు వేచి ఉన్నాం.. మరో రోజు వేచి ఉండలేమా? కౌంటింగ్‌కు మరో 4 రోజులు పడితే ఏమవుతుందని ప్రశ్నించారు. సులభతరమైన పనిని క్లిష్ట తరం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు నాయకుల్లోనే సందేహాలు ఉండేవని ఇప్పుడు ప్రజల్లో రేకెత్తటం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. ఐదేళ్లు కష్టపడి ప్రజల వద్దకు వెళ్లాం.. ప్రతి అభ్యర్థి, పార్టీ ప్రజాసేవ చేసి ఎన్నికలకు వచ్చారు.. ఐదేళ్ల కష్టానికి ప్రజా తీర్పు కోరటమే ఎన్నికలన్నారు. ఏకపక్షం చేయటం, అనుమానాస్పదం చేయటం సరైంది కాదన్నారు. ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం మంచి పద్ధతి కాదన్నారు. కరుడు గట్టిన నేరస్థులతో ఎన్నికల్లో పోటీపడ్డామని, దుర్మార్గపు పార్టీలను ఎదుర్కొన్నామని అందుకే ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అనుక్షణం పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని తేడావస్తే 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందే అన్నారు.