రాష్ట్రీయం

హంగ్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 20: కేంద్రంలో హంగ్ ఖాయమనే ధీమాతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ పరిధిలోకి వస్తే మహా కూటమికి అవకాశం ఇవ్వాలని ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలంటూ బుధవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి కోరనున్నట్లు తెలిసింది. ఈ నెల 23 తరువాత కేంద్రంలో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగట్టే వ్యూహంలో భాగంగా సోమవారం కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చంద్రబాబు మంత్రాంగం జరిపారు. బెంగాల్‌లో ఆదివారం నాడు పోలింగ్ సరళి, కేంద్రంలో బీజేపీ యేతర ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకత, జాతీయ, ప్రాంతీయ పార్టీల ఐక్య కూటమి కార్యాచరణ తదితర అంశాలపై మమతతో చర్చించారు. ఎగ్జిట్‌పోల్స్ సర్వేలపై ఒకవైపు పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పిస్తూనే మరోవైపు ఢిల్లీలో లాబీయింగ్ నడుపుతున్నారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో ఈవీఎంల మొరాయింపు, వీవీ ప్యాట్ల లెక్కింపులో ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదిక తదితర, ఈసీ వ్యవహారశైలి, కోడ్ అమలులో ఉన్నప్పటికీ ప్రధాని మోదీకి క్లీన్‌చిట్ ఇవ్వటం తదితర అంశాలపై జాతీయ పార్టీల నేతలతో కలసి మంగళవారం ఢిల్లీలో ఆందోళన నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. లక్నోలో ఇటీవల మాయావతి, అఖిలేష్ యాదవ్‌తో చర్చలు జరిపిన మేరకు ఎట్టకేలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీకి సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఈ భేటీ వాయిదా పడటంతో చంద్రబాబు మరోవిడత మాయావతి, అఖిలేష్‌తో సంప్రతింపులు జరపనున్నట్లు తెలిసింది. ఎన్నికల వరకు మహా కూటమికి సై అన్న ప్రధాన పార్టీల నేతలు ఇప్పుడు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడిన తరువాత కేంద్రంలో ప్రత్యామ్నాయంపై స్పందించే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు అయితే ఎగ్జిట్‌పోల్స్ సర్వేపై చంద్రబాబు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు ఒకవేళ ట్యాంపరింగ్ జరిగితే వీవీ ప్యాట్ రశీదులపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్, వామపక్ష, బీజేపీ యేతర పార్టీలతో ఉద్యమించాలని నిర్ణయించారు. ఈసీలో లుకలుకలు, కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా డిసెంట్ నోట్‌లపై జాతీయ పార్టీల నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు.

చిత్రం... కోల్‌కతాలో సోమవారం మమతా బెనర్జీతో సమావేశమైన చంద్రబాబు