రాష్ట్రీయం

రైళ్లలో నిఘా పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 20: దేశంలో ఇటీవల పెచ్చుమీరుతున్న ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. రైళ్ళల్లో అసాంఘిక కార్యకలాపాలు సర్వసాధారణంగా మారుతున్నాయి. నిషేధిత సరకుల అక్రమ రవాణా, రైలు ప్రయాణీకులపై దొంగల దాడులు, నగల దోపిడీ ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. ఇటువంటి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రయాణికులు సజావుగా వెళ్లేందుకు రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) ఉన్నతాధికారులు సత్వర చర్యలకు ఉపకమ్రిస్తున్నారు. దేశంలో దూర ప్రాంతాల మధ్య నడిచే రైళ్ళల్లో పటిష్ట భద్రత కొరవడుతున్న పరిస్థితులపైన వాట్సాప్, యూట్యూబ్ వంటి వాటిద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా భువనేశ్వర్, పూరి, మధ్యప్రదేశ్, కోల్‌కత్తా ఇతర ప్రాంతాల మీదుగా నడిచే సూపర్‌పాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణికుల నుంచి అందుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్‌పీ) సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయం, సమష్టిగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నారు.
* ఆర్పీఎఫ్ పోలీసుల చొక్కాలకు కెమెరాలు
వాల్తేరు డివిజన్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ దృష్ట్యా రైలు ప్రయాణికుల భద్రతపై ఆర్ఫీఎఫ్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటీవల ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ విశాఖరైల్వేస్టేషన్‌లో విస్తృతంగా పర్యటించి ఇక్కడి పోలీసు, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ జరిగింది. విశాఖ రైల్వేస్టేషన్‌లో భద్రతపై ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ స్థాయిలో సమీక్ష జరపడం ద్వారా భద్రతాపరమైన అంశాలను తెలుసుకున్నారు. అనేక లోపాలను నివారించడంతోపాటు జోన్ స్థాయిలో పటిష్ట భద్రత అవసరాన్ని గుర్తించిన ఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పద వ్యక్తులను పసిగట్టేందుకు వీలుగా పోలీసు సిబ్బంది దుస్తులకు చిన్నపాటి నిఘా కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. ఈ కెమెరాలో సంఘటన వివరాలన్నీ బంధించి రికార్డు చేస్తారు. రైళ్ళల్లో తరచూ జరిగే భారీ చోరీలకు సంబందించి కెమెరాల్లోని పుటేజీల ద్వారా చర్యలు తీసుకుంటారు. ఈ విధానం భారతీయరైల్వేలో ఒకటి, రెండు రైల్వేజోన్లకే పరిమితం కాగా, దీనిని మరికొన్ని జోన్లకు చెందిన డివిజన్లకు విస్తరించాలని నిర్ణయించారు. త్వరలో వాల్తేరుడివిజన్, సంబల్‌పూర్ డివిజన్లలో ఆర్‌పీఎఫ్ విభాగంలో ప్రవేశపెడతారని తెలిసింది. విధులు నిర్వహించే రైల్వే రక్షక దళం ఇక నుంచి వీటిని ఏర్పాటు చేసుకుంటారు. వీటి ద్వారా అనుమానితులను గుర్తించడం తదుపరి అదుపులోకి తీసుకోవడం, అలాగే గంజాయి, గుట్కా, కొకైన్, పేలుడు సామగ్రి, లైసెన్సు లేని బంగారం అక్రమ రవాణా వంటి వాటిని నిఘా కెమెరాల ద్వారా పసిగట్టడం ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. భారతీయరైల్వేలో ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలకు అవకాశాలు ఉన్న, అక్రమ సరకు రవాణా జరిగే ఆయా రైల్వేజోన్లకు సంబంధించి రైల్వే రక్షణ దళాలను పెంచాలని కూడా ఆలోచన చేస్తున్నారు. తదుపరి సూపర్‌ఫాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్‌ల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది దుస్తులకు చిన్నపాటి నిఘా కెమెరాలు అందివ్వాలని కూడా నిర్ణయించారు.