రాష్ట్రీయం

జూరాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మే 21: నారాయణపుర ప్రాజెక్టు గేట్లు మంగళవారం మూ సివేశారని అధికారులు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కర్నాటక ప్రభుత్వం నారాయణపుర ప్రాజెక్టు నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 2.50 టీఎంసీల వరద నీరు విడుదల చేశారు. ఈనెల 9వ తేది అర్ధరాత్రి కర్నాటక జలాలు 12 రోజుల పాటు 90 కిమీ పయనించి ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నాయి. ఈ వరద నీరు కర్నాటకలోని రెండు బ్యారేజిలు నిండుతూ, వాగులు, వంకలు, గుంతలు నిండుతూ నదీతీరాన పయనించి జూరాలకు చేరుకున్నాయి. ఆరు రోజుల ఆరుగంటలలో జూరాలకు 0.730 టీఎంసిల వరద నీరు వచ్చి చేరింది. జూరాలకు విడుదల చేసిన 2.50 టీఎంసీల వరద నీరు, ఇప్పటివరకు 0.730 టీఎంసీల మాత్రమే చేరుకోవడంతో కొంత ఉపశమనం కలిగించింది. ఇంకా జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. గత ఆరురోజులుగా జూరాలకు 0.730 టీఎంసీల వరద నీరు జూరాల జలాశయానికి వచ్చి చేరింది. మంగళవారం నాటికి జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి ఉదయం 482 క్యూసెక్కుల వరదనీరు రాగా, సాయంత్ర సమయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జూరాలలో 2.528 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువ నుంచి 150 క్యూసెక్కుల నీటిని రామన్‌పాడు ప్రాజెక్టుకు, కుడి కాలువ నుంచి 130 క్యూసెక్కుల నీటిని గద్వాలలోని జమ్ములమ్మ రిజర్వాయర్‌కు విడుదల చేసినట్టుఅధికారులు వెల్లడించారు. కాగా గత ఆరో రోజుల నుంచి జూరాల జలాశయానికి 0.730 టీఎంసీల కర్నాటక జలాలు వచ్చి చేరినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 2.528 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపుర డ్యాం గేట్లు మూసివేయడంతో జూరాల జలాశయంలో ప్రస్తుతం జూరాల జలాశయంలో 2.582 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగునీటి సమస్యను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఎగువ ప్రాంతంలో ముందస్తు వర్షాలు ప్రారంభం కావడం... జూరాలకు తాగు నీటి అవసరాలకోసం నీరు వచ్చి చేరడం... ఈ వేసవి నుంచి తాగు నీటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా గట్టెక్కినట్టే.

చిత్రం...జూరాల జలాశయం