రాష్ట్రీయం

చంద్రబాబు ఐరన్ లెగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఐరన్ లెగ్ అని జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు బాబు ఉచ్చులో చిక్కుకోవద్దని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్దన్ రెడ్డి హితవు చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని రకరకాల సర్వేలు చెప్పాయన్నారు. ఏపీలో టీడీపీ ఓటమి తథ్యమని ఆయన చెప్పారు. ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు హడావుడి చేయడం లేదని, కాని చంద్రబాబు మాత్రం ప్రజల సొమ్ముతో దేశమంతా తిరుగుతూ హడావుడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఒక రాజకీయ దళారి అన్నారు. 2014లో ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మిన చంద్రబాబు, తాజా ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ఆందోళనతో తిరుగుతున్నారన్నారు. ఢిల్లీలో చంద్రబాబును ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు మాట విని విపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఢిల్లీలో చంద్రబాబు మీటింగ్‌కు స్టాలిన్, కుమారస్వామి హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత ఆంధ్రాలో టీడీపీ ఆఫీసు గాంధీభవన్‌గా మారుతుందన్నారు. టీడీపీ నేతలు ఓటమి భయంతో అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. కౌంటింగ్ రోజు టీడీపీ పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడాలని కుట్ర పన్నిందన్నారు. ఈ నెల 23వ తేదీతో చంద్రబాబు రాజకీయ అధ్యాయం ముగుస్తుందన్నారు.