రాష్ట్రీయం

25 నుంచి వడగాల్పులు తీవ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. రోహిణి కార్తె కూడా ప్రారంభం అవుతుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపించనుంది. 29 వరకూ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత చాలాచోట్ల 48 డిగ్రీలకు చేరుకోనుందని ఆర్టీజీఎస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు ఉంటాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తరు స్థాయిలో వడగాల్పులు వీస్తాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా 45 నుంచి 48 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం, చిత్తూరు, జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ముందస్తు రుతుపవన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. 23 నుంచి 27 వరకూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇలావుండగా మంగళవారం 647చోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైంది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో 45.84 డిగ్రీలు, ప్రకాశం జిల్లా పెదారవీడులో 45.69, కడపలో 45.64, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 45.16, చిత్తూరు జిల్లా చియ్యవరంలో, గుంటూరు జిల్లా మాచవరంలో 45.05 డిగ్రీలు నమోదైంది. 45-45.9 డిగ్రీల మధ్య 10 ప్రాంతాలో ఉప్ణోగ్రత నమోదైంది.