రాష్ట్రీయం

తరలివస్తున్న బెట్టింగ్ వీరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: ప్రధాన రాజకీయపక్షాలకు ఎంతో ప్రతిష్టాకరంగా మారిన ప్రస్తుత ఎన్నికల ఫలితాలకు ఓ వైపు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా మరో వైపు లక్షల కోట్లతో బెట్టింగ్‌లు పెట్టుకున్న బెట్టింగ్‌దారులు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకుంటున్నారు. స్థానికంగా అభ్యర్థుల జయాపజయాలపై బెట్టింగ్‌లు పెట్టుకున్న వారు ఆయా జిల్లాల్లోనే ఉండిపోగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభుత్వాల ఏర్పాటుపై బెట్టింగ్‌లు పెట్టుకున్నవారు ఏకంగా విజయవాడకు వస్తున్నారు. స్టార్ హోటళ్ల నుంచి నామమాత్రపు లాడ్జీల వరకు ముందుగానే గదులన్నీ బుక్ అయిపోయి ప్రస్తుతం బెట్టింగ్‌దారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ అతిథి గృహాలు, కల్యాణ మండపాలు, ఎంతో కాలంగా ఖాళీగా కన్పిస్తూ వచ్చిన నివాస గృహాలు సైతం ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. కొన్ని హోటళ్ల యజమానులు రెట్టింపు అద్దెలు వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపాలు, ప్రైవేటు అతిథి గృహాల్లో కొత్త టీవీలను అమర్చుతున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా టీవీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కమీషన్‌ల రూపంలో బెట్టింగ్‌లు నిర్వహించే వ్యక్తులే తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ నాలుగు రోజులు మద్యం వినియోగం భారీగా ఉండనుంది. దీంతో మద్యం దుకాణాల నుంచి భారీ ఎత్తున మద్యం నిల్వలు తరలిపోతున్నాయి. 23వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల మూత కారణంగా మద్యపాన ప్రియులు ముందుగా మద్యాన్ని రహస్య ప్రదేశాల్లో నిలువ చేసుకుంటున్నారు. కల్యాణమండపాలు, ఆడిటోరియాల్లో పసందైన వంటకాల కోసం వంటగాళ్లను సిద్ధం చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో జరుగుతున్న మద్యం అమ్మకాలు చూస్తుంటే ముఖ్యంగా ఓట్ల లెక్కింపు రోజున దుకాణాలు బందైనా మద్యం మాత్రం ఏరులై పారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పలువురు అభ్యర్థులు గెలుపు ధీమాతో తమతమ కౌంటింగ్ ఏజెంట్ల కోసం ముందుగా భారీ ఎత్తున మద్యాన్ని రహస్య ప్రదేశాల్లో నిలువ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఓ సవాల్ వంటిదే.