రాష్ట్రీయం

కట్టుదిట్టంగా కౌంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. విస్తృత బందోబస్తు నడుమ గురువారం ఉదయం 8 గంటలకు రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రతి కౌంటింగ్‌హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా సర్వీస్, పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. రాష్ట్రం మొత్తంగా ఈ నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3 కోట్ల 95 లక్షల మంది పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఏడు దశలుగా జరిగిన ఎన్నికలు గత ఆదివారంతో ముగిసాయి. గురువారం లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో 36 కేంద్రాల్లో 350 హాళ్లలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. లెక్కింపు పర్యవేక్షణకు లోక్‌సభ, శాసనసభ స్థానాల వారీగా కేంద్ర, రాష్ట్ర
పరిశీలకులు నియమితులయ్యారు. రాష్ట్ర స్థాయిలో మరో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మొత్తం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేంద్రాల ప్రాంగణంలో 100 మీటర్ల దూరం వరకు వాహనాలకు అనుమతివ్వరు. లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రానికి పది కంపెనీల కేంద్ర బలగాలను రప్పించామన్నారు. ఎలాంటి హింస, ఘర్షణలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని వివరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఈవీఎంల పరిశీలనకు ఇద్దరు బెల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఇప్పటి వరకు 2లక్షల 40వేల పోస్టలల్ ఓట్లు, మరో 30వేల సర్వీస్ ఓట్లు వచ్చాయని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తామని, మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాలపై ఓ అవగాహనకు రావచ్చన్నారు. సువిధ యాప్, ఈసీఐ వెబ్‌సైట్లలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు ఉంటే సుప్రీం కోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేర వీవీ ప్యాట్లను లెక్కిస్తామని చెప్పారు. కౌంటింగ్ పూర్తయిన తరువాత పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు. లెక్కింపు పూర్తయిన తరువాత రీ పోలింగ్ ప్రసక్తి ఉండదన్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. హెచ్‌టీటీపీఎస్://రిజల్ట్స్.ఈసీఐ.జీవోవి.ఇన్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఓటర్స్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తెలుసుకునే వీలుందని చెప్పారు. ఓట్ల లెక్కింపును రౌండ్ల వారీ, పూర్తయిన తరువాత ఫలితాలను తెలుసు కోవచ్చన్నారు.
నిబంధనలు తప్పనిసరి
కౌంటింగ్ కేంద్రాలకు హాజరయ్యే రాజకీయ పార్టీల ఏజెంట్లు విధిగా ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు వారితో పాటు కేవలం పెన్ లేదా పెన్సిల్, తెల్ల కాగితాలు, నోట్‌ప్యాడ్, ఫారం-17సీలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన తరువాత సంబంధిత ప్రిసైడింగ్ అధికారి జారీచేసిన డూప్లికేట్ కాపీలను తీసుకోవాలన్నారు. అధికారులు జారీచేసిన 17-సీని కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సమయంలో ఉపయోగపడేలా సరిచూసుకునేందుకు అనుమతిస్తామని వివరించారు. అపరిచిత వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా సీసీ, వెబ్ కెమెరాలతో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని ద్వివేది తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.