రాష్ట్రీయం

‘ఖమ్మం’పై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 22: పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల నాయకుల చూపు ఖమ్మం పైనే కేంద్రీకృతమయింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కుదేలైన అధికార టీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకునేందుకు ప్రయత్నించగా, ఉన్న పట్టు కోల్పోరాదనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన 41 రోజుల ఉత్కంఠ తర్వాత మరి కొద్ది గంటల్లోనే ఫలితం రానుందనే విషయంతో అన్ని రాజకీయ పార్టీల నేతల చూపు ‘ఖమ్మం పార్లమెంటు’ స్థానంపైనే పడింది. ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజక వర్గాలు మహాబూబాబాద్ పార్లమెంటు పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు ఖమ్మం, అటు మహబూబాబాద్ రెండు పార్లమెంటు స్థానాల ఎన్నికల ఫలితాలపై చర్చలు జోరందుకున్నాయి. విజయం ఎవరి సొంతం కానుందో అని ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు. అయితే ఖమ్మం లోక్‌సభ నియోజక వర్గం పరిధిలో మొత్తం 15,13,094 మంది ఓటర్లు ఉండగా వీరిలో 11,38,130 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటంతో 75.22శాతం పోలింగ్ నమోదైంది. వీటితోపాటు మొత్తం 1683 పోస్టల్ బ్యాలెట్లను పంపిణీ చేయగా 830 పోస్టల్ బ్యాలెట్‌లు, 715 సర్వీసు ఓటర్లకుగాను 431 సర్వీసు ఓటర్లు వచ్చారని ఈ ఓట్లను ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ టేబుళ్ల వద్ద లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆ తర్వాత మొత్తం 23 రౌండ్ల లెక్కింపు నిర్దేశించిన టేబుళ్ల వారీగా నిబంధనల ప్రకారం ఓట్లను లెక్కించనున్నారు. దీంతో అభ్యర్థులతోపాటు రాజకీయ పార్టీల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలకు చెందిన నేతలు ఓట్ల లెక్కింపు విషయంపై వారు నియమించుకున్న ఏజెంట్లతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రతలను కూడా వివరించారు. ఈవిఎంల ఓట్ల లెక్కింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏజెంట్లకు తగు సలహాలు, సూచనలను సైతం అందజేశారు. వరుస విజయాల పరంపరను కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీపై వ్యతిరేకత, కాంగ్రెస్‌పై అభిమానం, హస్తవాసి కలిసొస్తుందని ప్రధాన పార్టీల అభ్యర్థులు గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. విజయం తమవైపే ఉంటుందని అభ్యర్థులు భరోసాతో ఉన్నారు.