రాష్ట్రీయం

ఇస్రోకు ద్రవ హైడ్రోజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు/తడ, మే 22: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటిలోని విఆర్‌వి ఆసియా పసిఫిక్ ఉత్పత్తి కర్మాగారంలో తయారైన దేశంలోనే అతిపెద్ద ద్రవహైడ్రోజన్ నిల్వ ట్యాంకును భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అధ్యక్షులు డాక్టర్ కె శివ లాంచనంగా స్వీకరించారు. బుధవారం వీఆర్వీ పరిశ్రమ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఇస్రోకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో డాక్టర్ శివన్ ట్యాంకు రవాణా వాహనానికి లాంఛనంగా పచ్చజెండా ఊపారు. ఈ ట్యాంకును శ్రీహరికోట షార్ కేంద్రానికి తరలించారు. రాకెట్ కేంద్రంలో ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా వీ ఆర్వీ మేనేజింగ్ డైరెక్టర్ ఇఎల్ రంగన్‌కేర్ , డాక్టర్ శివన్, ఇతర సీనియర్ అధికారులకు స్వాగతం పలికారు. శ్రీసిటి తరపున శ్రీసిటి ఫౌండేషన్ అధ్యక్షులు రమేష్ సుబ్రమణ్యం, డాక్టర్ శివన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్యాంకు సాంకేతిక వివరాలు, దాని తయారీ గురించి సవివరంగా వివరిస్తూ తమకు పూర్తి సహకారం అందించిన ఇస్రో ఇంజనీర్లకు రంగన్‌కేర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ ద్రవ హైడ్రోజన్ నిల్వ ట్యాంకును పూర్తిగా భారతదేశ పరిజ్ఞానంతో రూపొందించి ఇస్రోకు అందించినందుకు వీఆర్వీ ఆసియా పబ్లిక్ బృందాలను అభినందించారు. రాకెట్లలో ఉపయోగించే ట్యాంకర్ తయారీ చేపట్టడానికి ముందుకు రావల్సిందిగా ఆయన వీ ఆర్వీ అధికారులకు సూచించారు. షార్ డైరెక్టర్ ఎస్ పాండియన్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇస్రో ఇండస్ట్రీ పరస్పర సహకారానికి ఒక మంచి ఉదాహరణగా ఈ కార్యక్రమం పరిగణించొచ్చన్నారు. షార్ ఇంజనీర్ల సహాయ సహకారాలతో లిక్విడ్ నత్రజని షీల్డు గల ఈ ద్రవ హైడ్రోన్ నిల్వ ట్యాంకును పీ ఆర్వీ పరిశ్రమ తయారు చేసింది. దీని నిల్వ సామర్ధ్యం 120 కిలో లీటర్లు. ఉపగ్రహ ప్రయోగ వాహనాల్లో ద్రవ హైడ్రోన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తారు. చార్టు గ్రూపులో భాగమైన వీ ఆర్వీసి ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటిలో నెలకొల్పిన క్రయోజనిక్ సామగ్రిని రూపొందించి తయారు చేస్తుందన్నారు. 30 ఎకరాల స్థలంలో ఉన్న ఈ కర్మాగారం 10వేల చదరపు మీట్ల విస్తీర్ణం కలిగి వుందని తెలిపారు.
చిత్రాలు.. ట్యాంక్ రవాణాకు జెండా ఊపుతున్న డాక్టర్ శివన్