రాష్ట్రీయం

కాయ్ రాజా కాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు వస్తాయని, నిజామాబాద్‌లో కవిత, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థులు కిషన్ రెడ్డి, డీకే అరుణ, మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి విశే్వశ్వరరెడ్డి గెలుపుపై బెట్టింగ్‌లు పెరిగాయి. ఆంధ్రాకు పరిమితమైన బెట్టింగ్ జూద క్రీడ హైదరాబాద్, ఇతర జిల్లాలకు పాకింది. ఆంధ్రాలో బెట్టింగ్‌లు పతాక స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్, విజయవాడతో పాటు రెండు రాష్ట్రాల్లోప్రధాన నగరాల్లో లాడ్జిల్లో బెట్టింగ్ జూద గాళ్లు తిష్టవేశారు.
ఆంధ్రాలో వైకాపా, టీడీపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉండడంతో ఆ రెండు పార్టీల గెలుపుపై కోట్లాది రూపాయల పందెం కాస్తున్నారు. ఈ నెల 19వ తేదీన ఎగ్జిట్ పోల్స్ రావడంతో బెట్టింగ్‌లకు అడ్డూ అదుపులేకుండా పోయింది. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో లాడ్జిలు, హోటళ్లు, ముఖ్యమైన కూడళ్లలో పందెం రాయుళ్లు నోట్ల కట్టలతో భారీ పందేలు కాస్తున్నారు. తమకు నమ్మకం అయిన మధ్యవర్తి వద్ద డబ్బును పెట్టి పందెం కాస్తున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో బెట్టింగ్‌ల ఆహ్వానాలు వెళుతున్నాయి. ప్రత్యేక కోడ్ భాషలో బెట్టింగ్‌లు కడుతున్నారు. గత ఎన్నికల్లో లగడపాటి నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలు తెలంగాణలో ఫెయిలయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ కూటమి వస్తుందని లగడపాటి చెప్పారు. కాని టీఆర్‌ఎస్ పెద్ద మెజార్టీతో నెగ్గడంతో చాలామంది టీడీపీ, కాంగ్రెస్ కూటమివైపు బెట్టింగ్ కట్టి జేబులు ఖాళీ చేసుకున్నారు.గతంలో తెలంగాణ జిల్లాలకు లేని బెట్టింగ్ సంస్కృతి ఇప్పుడు పాకింది. రాష్ట్ర పోలీసు శాఖ ఆదేశం మేరకు పలు పట్టణాల్లో బెట్టింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఆంధ్రాలో బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపూర్, లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాకలో గెలుపు అవకాశాలపై విపరీతంగా బెట్టింగ్ నడుస్తోంది. లగడపాటి సర్వేను నమ్మి డబ్బును పొగొట్టుకోవద్దని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడం, ప్రజలను కోరడం సంచలనం కలిగించిన విషయం విదితమే. లగడపాటి ఆంధ్రాలో టీడీపీ కూటమికి గెలుపు అవకాశాలున్నాయని చెప్పిన విషయం విదితమే. గుంటూరు ఎంపీ, నర్సరావుపేట, చిలుకలూరిపేట అసెంబ్లీ స్థానాలు, విశాఖపట్నం, విజయవాడ ఎంపీ స్థానాలపై బెట్టింగ్‌లపై పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. గురువారం రోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ముందు మెజారిటీ వచ్చి, ఆ తర్వాత తగ్గే సమయంలో కూడా బెట్టింగ్‌లు ఇంకా భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.