రాష్ట్రీయం

ఈసెట్ టాపర్లు తరుణ్, శ్రావణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో నేరుగా రెండోసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను బుధవారం సాయంత్రం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, జేఎన్‌టీయూ హెచ్ వీసీ ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్‌రెడ్డి విడుదల చేశారు. ఈసెట్‌కు 28,037 మంది రిజిస్టర్ చేసుకోగా, పరీక్షకు 27,123 మంది హాజరయ్యారని, వారిలో 24,497 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారిలో ఓసీలు 3075 మంది, బీసీఎ 1997, బీసీ బీ 6291 మంది, బీసీసీ 89 మంది, బీసీ డీ 5063 మంది, బీసీ ఈ 1435 మంది, ఎస్సీ 4206, ఎస్టీ 2341 మంది ఉన్నారు. తెలుగురాష్ట్రాల్లో 89 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వారు చెప్పారు.
టాపర్లు వీరే..
ట్రిపుల్‌ఈ విభాగంలో టి తరుణ్ టాపర్‌గా నిలిచాడు, తర్వాతి స్థానాల్లో మహ్మద్ ముబీన్, గుండు లచ్చయ్య విష్ణు ప్రియ, పిసాటి రాఘవేంద్రరెడ్డి, తుంగిని మానస నిలిచారు, సీఎస్‌ఈలో విన్నకోట శ్రావణి, విడుగుల వరుణ్, సీహెచ్ తిలక్‌రెడ్డి, టీ రిచిత, నర్రా రమ్యశ్రీ, మెకానికల్ విభాగంలో జోగం గౌతం, పడవల రాజేష్, గోంటెల రాం, మానికణి సాయి కుమార్, ఎల్ హరీష్ టాపర్లుగా నిలిచారు. సివిల్ ఇంజనీరింగ్‌లో ఎస్ ప్రణతి, దువ్వల అనిల్, చిక్రం రంజిత్ కుమార్, కే కుమార్, గొలుసుల వంశి, మైనింగ్‌లో డీ సాయి వెంకటరా, వాసిరెడ్డి మహేష్, గదే వియ్, మనోజ్ దాసరి, ఈసీఈలో కే సుజయ్ కుమార్, బొర్రా హృషీకేశ్, మాదిరెడ్డి సాత్విక్‌రెడ్డి, కొందురు శ్రీకన్య, కాసా ప్రవలిక , కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎన్ లక్ష్మీ విశ్వనాధ్, బండారు సారిక, జీ భావనరెడ్డి, ఆకుల రుషికేశ్, గొల్లపూడి ఎస్‌ఎస్ శ్రీకృష్ణ చైతన్య, మెటలర్జికల్‌లో వేముల అనిల్ కుమార్, కొమ్ముల సాయి మణికంఠ, కే శివశంకర్ రావు, కే రామకృష్ణ, జీ సృజన, ఎలక్ట్రానిక్స్ ఇనుస్ట్రుమెంటేషన్‌లో వీ సాయి సీతారాం, చిర్రం మేఘన, ఉత్కం మమత, కోట రమాకాంత్, ఫార్మసీలో సరునిల తేజసాయి, కాల్వ జ్యోత్న్స, వనం నవ్య, షేక్ మహ్మద్ సంసుద్దీన్, సీ నిఖిత, బిఎస్సీ విభాగంలో దుర్గం నవీన్ కుమార్, సుధాకర్ బంరి, నజీర్ అహ్మద్, బీ వాజీడు అలి, బొల్లి అజయ్‌లు టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్ స్ట్రీం, ఫార్మసీ స్ట్రీం, బిఎస్సీ (మాథమెటిక్స్) స్ట్రీంల ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు ఎంపికైన వారి జాబితాను ఈ సందర్భంగా విడుదల చేశామని కన్వీనర్ డాక్టర్ ఏ గోవర్థన్ తెలిపారు.
ఈసెట్ ర్యాంకులు, మార్కులతో పాటు ఈసెట్‌పై రిపోర్టు అందించామని, టాపర్ల జాబితాను, ఫలితాల విశే్లషనను పోర్టల్‌లో ఉంచామని వారు చెప్పారు.