రాష్ట్రీయం

నమ్మకాన్ని నిలబెడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటానని, ఆరు నెలల నుంచి సంవత్సరంలోగా మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకుంటానని వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిన నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో తొలిసారిగా మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారన్నారు. 25 ఎంపీ సీట్లకు 25, 175 అసెంబ్లీ సీట్లకు 153 గెలిపించడం ద్వారా ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారన్నారు. ఈ విజయం దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో సాధ్యమైందన్నారు. ఈ విధంగా ప్రజలందరి ఎదుట ముఖ్యమంత్రిగా నిలబడే అదృష్టం దేవుడి దయ, చల్లని తల్లుల దీవెనలతో కలిగిందన్నారు. ఈ ఘన విజయం తనపై ఉన్న విశ్వాసాన్ని, బాధ్యతలను మరింత పెంచుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేశారంటే విశ్వసనీయతకు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుందని తమ ఓటు ద్వారా ప్రజలు చూపించారన్నారు. తనపై ఎంతో విశ్వాసంతో ఓటు వేశారని, వారందరికీ తాను ఒకటే చెప్పదలుచుకున్నానని, వారి నమ్మకానికి నిలబెట్టుకుంటానన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒక్కరికి ముఖ్యమంత్రిగా కూర్చునేందుకు అవకాశం ఇస్తారన్నారు. ఆ అవకాశం ప్రజలందరి దీవనెల వల్ల తనకు దేవుడు ఇచ్చాడన్నారు. ఆ అవకాశం తనకు రావడంతో కొత్త పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. ఆరు నుంచి సంవత్సరంలోపే ప్రజలందరి చేత జగన్ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ప్రకటించారు. తన ప్రతి అడుగు ప్రజల కోసమేనని మాట ఇస్తున్నానన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నవ రత్నాలను తాను గట్టిగా నమ్ముతున్నానని, 3600 కిలోమీటర్ల తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని, బాధలు విన్నానని తెలిపారు. తాను ఉన్నానంటూ అందరికీ హామీ ఇస్తున్నానన్నారు. నవరత్నాలను తీసుకువచ్చే పాలన కచ్చితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం విజయవాడలో మే 30న చేయనున్నట్లు తెలిపారు.

చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి