రాష్ట్రీయం

‘దేశం’ కకావికలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. గెలుపుఖాయమని భావించినా 150 సీట్లు సాధించి ఎగ్జిట్‌పోల్ సంస్థలు, రాజకీయ విశే్లషకులను ఆశ్చర్యపరిచింది. అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత భారీ మెజారిటీ దక్కుతుందని ఊహించి ఉండరు. అనేక మంది మంత్రులు పరాజయం పొందారు. టీడీపీ ఘోరపరాజయానికి ప్రభుత్వం అనుసరించిన విధానాలతో పాటు, అధినేత చంద్రబాబు వైఖరి కూడా కారణమని రాజకీయ విశే్లషకులు అంచనావేస్తున్నారు. అసెంబ్లీలో మొత్తం సీట్లు 175. రాష్ట్రం మొత్తం మీద విజయనగరం, కడప, నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లను వైకాపా స్వీప్ చేసింది. ఇందులో రాయలసీమలో 52 సీట్లలో దాదాపు 48 దక్కించుకుంది. కర్నూలులో 14 సీట్లలో 13 స్థానాల్లో గెలిచింది. కడప జిల్లాలో పది సీట్లలో వైకాపా విజయబావుటా ఎగురవేసింది. అనంతపురం జిల్లాలో 14 సీట్లలో 13 సీట్లలో వైకాపా గెలిచింది. ఒక్క హిందూపూర్‌లో మాత్రం టీడీపీ గెలిచింది. చిత్తూరు జిల్లాలో 14 సీట్లలో 13 చోట్ల వైకాపా, రెండింట టీడీపీ గెలిచింది. నెల్లూరు జిల్లాలో మొత్తం పది సీట్లలో వైకాపా విజయం సాధించింది. ప్రకాశం జిల్లాలో 9 సీట్లనూ వైకాపా తనఖాతాలో వేసుకుంది. గుంటూరు జిల్లాలో 14 సీట్లలో వైకాపా, టీడీపీ రెండు సీట్లలో, కృష్ణా జిల్లాలో 14 సీట్లలో వైకాపా, రెండు సీట్లలో టీడీపీ, పశ్చిమగోదావరి జిల్లాలో14 సీట్లలో వైకాపా, ఒక సీటులోటీడీపీ, తూర్పుగోదావరి జిల్లాలో 14 సీట్లలో వైకాపా, నాలుగు సీట్లలో టీడీపీ, ఒక సీటులో జనసేన గెలిచింది. విశాఖపట్నం జిల్లాలో 12 సీట్లలో వైకాపా, టీడీపీ మూడు సీట్లలో గెలిచింది. విజయనగరం జిల్లాలో 9 సీట్లలో వైకాపా నెగ్గింది. శ్రీకాకుళం జిల్లాలో 8 సీట్లలో వైకాపా, రెండు సీట్లలో టీడీపీ గెలిచింది. పార్లమెంటు సీట్లలో కూడా వైకాపా తన హవా కొనసాగిస్తోంది. 23 సీట్లలో ఖాయం చేసుకుంది. విజయవాడ సీటు శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభసీట్లలో వైకాపా, టీడీపీ మధ్య హోరాహోరీనడుస్తోంది. మంత్రుల్లో అచ్చెంనాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావుమాత్రం గెలిచారు. ఇతర మంత్రులు కళావెంకట్రావు, పితాని సత్యనారాయణ, నారాయణ, అమర్‌నాథ్ రెడ్డి, పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, కడప ఎంపీగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ ఘోర పరాజయం పొందారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలే పార్టీకి శాపంగా పరిణమించాయని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునేది. 1983లో సంజయ్ విచార్‌మంచ్, 1985లో బీజేపీ, వామపక్షపార్టీలు, 1989లో వామపక్ష పార్టీలు, 1994లో వామపక్షపార్టీలు, 1999లో బీజేపీతో పొత్తుపెట్టుకుంది. అలాగే 2004లో బీజేపీ, 2009 వామపక్షపార్టీలు, టీఆర్‌ఎస్‌తో కలిపి మహాకూటమితో పొత్తు పెట్టుకుంది. 2014లో బీజేపీ, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. అయితే 94, 2004, 2009 ఎన్నికల్లో పొత్తులున్నా టీడీపీ ఓటమి చెందింది. ఈసారి కేంద్రంతో ఘర్షణ పడడం, మోదీకి దూరం కావడం టీడీపీకి శాపంగా పరిణమించింది. వాస్తవానికి కేంద్రంతో చంద్రబాబు గొడవపడాల్సిన అవసరం లేకున్నా, సహేతుకం కాని కారణాలతో బీజేపీకి దూరమయ్యారు. ఆ తర్వాత జనసేనతో కూడా పొత్తు పెట్టుకోలేకపోయారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడమే టీడీపీ చిత్తుగా ఓటమి చెందేందుకు కారణమైంది. సంక్షేమ విధానాలు, అభివృద్ధి మంత్రం వల్లనే అధికారంలో ఉన్న పార్టీలు గెలవలేవు. ఈ ఎన్నికల్లో పొత్తు ఉండి ఉంటే ఇంత పరాభవం జరిగి ఉండేది కాదు. కనీసం 50కు తక్కువకాకుండా సీట్లు వచ్చేవని అంటున్నారు.