రాష్ట్రీయం

ఫ్యాన్ సుడిగాలిలో బాలయ్య జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మే 23: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలోనూ అనంతపురం జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ జయకేతనం ఎగురవేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికలో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందుతూ వస్తున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి, విశ్రాంత ఐజీ మహమ్మద్ ఇక్బాల్‌పై 17,028 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓవైపు రాష్టవ్త్రాపంగా ఫ్యాన్ గాలి వీయగా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం రెండు రౌండ్లు మినహా 17 రౌండ్లలో బాలకృష్ణకు మెజార్టీ దక్కింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు వేల ఓట్ల మెజార్టీతో గెలవగా హిందూపురం నుంచి బాలయ్య మాత్రం గతం కంటే మెజార్టీని మెరుగు పర్చుకోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మూడుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇందులో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, ఓ పర్యాయం ప్రతిపక్ష నేతగా ప్రాతినిథ్యం వహించి హిందూపురం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశారు. ఎన్టీఆర్ మరణాంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణను 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపించి పురం ఓటర్లు నందమూరి కుటుంబాన్ని ఆదరించారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో చివరి క్షణంలో ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి నవీన్‌నిశ్చల్‌పై 16 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏదిఏమైనా వైకాపా సునామీలోనూ 17,028 ఓట్ల మెజార్టీతో బాలకృష్ణను గెలిపించి నందమూరి కుటుంబంపై ఉన్న విశ్వాసాన్ని మరోమారు చాటుకున్నారని చెప్పవచ్చు.