రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెలంగాణలో పార్లమెంట్ ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. పాలకపక్షం తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. చివరకు విపక్షాలు కూడా ఉహించని రీతిలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల వల్ల టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం తర్వాత రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు కకావికలమైన నేపథ్యంలో పార్లమెంట్ ఫలితాలు విపక్షాలకు జీవం పోశాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను మిత్రపక్షం ఎంఐఎంకు ఒక్క స్థానాన్ని మినహాయించి మిగిలిన 16 సీట్లూ గెలుస్తామన్న అధికార పార్టీ చివరికి 9 స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తంగా 17 సీట్లలో మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి 10 స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకొని మెజారిటీ స్థానాలను సొంతం చేసుకున్నప్పటికీ ఆ పార్టీకి ఉహించని షాకేనని చెప్పవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంతంగా 11 సీట్లు గెలుచుకోగా, ప్రస్తుత ఎన్నికల్లో రెండు సీట్లు తగ్గి 9 సీట్లకు పరిమితం కావడం గమనర్హం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కంటే బీజేపీ ఒక్క స్థానాన్ని అదనంగా గెలుచుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో సికింద్రాబాద్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగిన బీజేపీ ఈ సారి ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండానే సొంతంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాలు గెలుచుకోవడం ఆ పార్టీకి ఉహించని విజయమే. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఈ ఫలితాలు దోహదం చేస్తాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, నాగర్‌కర్నూల్ స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో అదనంగా మరొక సీటును తన ఖాతాలో వేసుకుంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మనుగడ కష్టం అనుకున్న దశలో లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్లమెంటు సీట్లు గెలుచుకోవడం గమనార్హం. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి ఒక ప్రత్యేకత ఉంది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి ఆర్వింద్ చేతిలో ఓటమి పొందారు. కరీంనగర్ బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ సీనియర్ ఎంపీ వినోద్‌కుమార్‌ను కూడా ఓటమి కరిపించిన బండి సంజయ్ కూడా బీజేపీ అభ్యర్థియే కావడం మరో విశేషం. పట్టణ ప్రాంత పార్టీగా ముద్ర పడిన బీజేపీకి, దండకారణ్యంలోని ఆదిలాబాద్‌లో ఎస్‌టీ రిజర్వు స్థానం నుంచి ఉహించని విజయాన్ని అందించి సోయం బాపురావు చరిత్ర సృష్టించారు.
దేశ రాజకీయాల్లో గుణత్మాక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ స్థాపించాలన్న టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశలపై పార్లమెంట్ ఫలితాలు నీళ్లు చల్లి రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాల్సిందిగా రాష్ట్ర ప్రజలు పరోక్షంగా తీర్పు చెప్పారు.