రాష్ట్రీయం

నవ్వులు పూయించిన వెంకయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఏప్రిల్ 11: తన మాటతీరుతో అందిరినీ ఆకట్టుకునే కేంద్రమంత్రి వెంకయ్య చలోక్తులు విసరడంలోనూ నేర్పరి అని చెప్పాలి. సందర్భోచితంగా మాట్లాడుతూనే నవ్వులు పండిస్తుంటారు. అలాంటి ఘటన విశాఖలో సోమవారం చోటుచేసుకుంది. విశాఖలో సోమవారం విమ్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరైన వెంకయ్య వైద్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రోగులకు సకాలంలో వైద్య సేవలందించి త్వరగా పంపాలన్నారు. పంపడం అంటే పైకి కాదు.. క్షేమంగా ఇంటికి అని అనడంతో వేదికపై ఉన్న ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి బండారు, మంత్రులు గంటా, కామినేని, అయ్యన్నపాత్రుడు పలువురు ఎమ్మెల్యేలు, సభకు హాజరైన వైద్యులు ఒక్కసారిగా నవ్వుకున్నారు. దీంతో అక్కడ కాసేపు హస్యం పండింది. అనంతరం ఆసుపత్రిలోని వార్డుల్లో కలయదిరిగిన వెంకయ్య పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, విమ్స్ డైరక్టర్ సుధాకర్‌బాబు పాల్గొన్నారు.