రాష్ట్రీయం

ఈ పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): పాతికేళ్ల ప్రస్థానాన్ని అలోచించే, అన్నింటికీ సిద్ధపడే పార్టీని స్థాపించినట్లు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న ఆయన ఓటమితో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తుదిశ్వాస వరకు కష్టపడి పనిచేసి మాట నిలబెట్టుకుంటానన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టామన్నారు. ప్రజాసమస్యలపై కడదాకా పోరాడతామన్నారు. రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రజా పోరాట యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోగలిగామన్నారు. ఎదురొచ్చే అన్ని సమస్యలను ఎదుర్కొనే సత్తా, గుండె ధైర్యం తనకు ఉందన్నారు. మార్పుకోసం నేటి, రేపటితరాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కార వంతమైన రాజకీయాలు చేస్తున్న జనసేన సారాయి, బిర్యానీ, డబ్బులు ఓటర్లపై వెదజల్లలేదని వ్యాఖ్యానించారు. పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసిన ప్రతీ ఒక్క సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. బలమైన మెజార్టీతో వచ్చిన వైసీపీకి, ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హార్థిక శుభాకాంక్షలు చెప్పా రు. కేంద్రంలో మంచి మెజార్టీ సాధించిన, మరోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్రమోదీకి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. ఈ విషయంలో మోదీ శ్రద్ధ చూపాలని, వైసీపీ కూడా ఇందుకు తగిన కృ షి చేయాలని విజ్ఞప్తి చేశారు. జనసేనకు ఓటు వేసిన ఓటర్లకు, పార్టీ కోసం పనిచేసిన జనసైనికులు, విదేశాల నుంచి ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తుది శ్వాస వరకు ప్రజలకిచ్చిన మాట తప్పమని మరోసారి స్పష్టం చేసిన ఆయన ప్రజాసమస్యల పోరాటం కొనసాగిస్తానన్నారు.