రాష్ట్రీయం

హతాశులైన జనసేన శ్రేణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: జనసేన పార్టీ అటు ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం కావడంతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. పార్టీ అధినేత రెండు చోట్ల ఓడిపోవడం మరింత దిగ్భ్రాంతి కలిగించింది. గాజువాక , భీమవరం పట్టణాల్లో పోటీచేయిగా, ప్రచారం చేయకున్నా గెలిచే అవకాశం ఉన్నట్టు పార్టీ శ్రేణులు భావించాయి, ఆ ఆలోచనే పవన్‌కళ్యాణ్ ఓటిమికి ప్రధానకారణంగా చెబుతున్నారు. గాజువాకలో జనసేన కార్యకర్తలు కొంత మంది ప్రచారం మినహా నియోజకవర్గం చాలా ప్రాంతాల్లో పవన్‌కళ్యాణ్ కనీసం ముఖం కూడా చూపించకపోవడంతో ఫలితాలు రివర్స్ అయ్యాయని పార్టీ శ్రేణులు విశే్లషిస్తున్నాయి. భీమవరంలో విస్తృతంగా ప్రచారం చేసినా, ఫ్యాన్ గాలిలో కలిసి రాలేదని అంటున్నారు. కాపు సామాజిక వర్గం ఆశీస్సులతో జనసేన పార్టీని ప్రారంభించినా, రానురాను ఆ పార్టీపై కాపుముద్ర పడకుండా పవన్‌కళ్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రజాస్వామ్య పార్టీగా మాలిచే ప్రయత్నమే ఆ పార్టీకి శాపమైందని అంటున్నారు. ఇటు కాపులూ ఆదరించక, అటు మిగిలిన కులాలు, వర్గాలూ ఆదరించక రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది. ఇరు రాష్ట్రాల్లో ఒకే ఒక నియోజకవర్గాన్ని దక్కించుకున్న జనసేన రానున్న రోజుల్లో తన ముద్ర ఎంత వరకూ వేసుకుంటుందనేది అనుమానాస్పదమేనని చెబుతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసినా కాలం కలిసి రాకపోవడం, తెలంగాణలో మాయావతితో కలిసి ప్రచారం చేయడం , అందుకు పార్టీ భారీ సభలనే నిర్వహించడం కూడా ఆ పార్టీకి అనుకూలించలేదు. కోటీశ్వర్లు పోటీ పడి టిక్కెట్లు కోరినా, వారికి నిరాకరించి సామాన్యులను ఎంచుకుని వారిని రంగంలోకి దింపడం ద్వారా ఆప్ చేసిన ప్రయోగాన్ని ఆంధ్రాలో తానూ చేద్దామని చూసిన పవన్‌కళ్యాణ్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సభ్యులు అంతా ఓటమి పాలైనా పెద్దగా పట్టించుకునే వాళ్లం కాదు, పార్టీ అధినేత రెండు చోట్ల ఓడిపోవడం తాము జీర్ణించుకోలేకపోతున్నామని జనసేన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.