రాష్ట్రీయం

ఖమ్మంలో నామా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 23: ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై 1,66,429ఓట్ల మెజార్టీతో నామా ఘన విజయం సాధించారు. మొత్తం 11,32,439ఓట్లకు గాను నామాకు 5,63,625, రేణుకాచౌదరికి 3,97,196ఓట్లు వచ్చాయి. ఖమ్మం స్థానంలో సీపీఎంకు 56,606ఓట్లు రాగా బీజేపీకి 20,327ఓట్లు వచ్చాయి. నోటాకు 15,743ఓట్లు రావడం విశేషం. ఖమ్మం స్థానంలో 23మంది అభ్యర్థులు పోటీ పడగా 23రౌండ్లల్లో లెక్కించిన ఓట్లలో అన్ని రౌండ్లల్లోను నామా నాగేశ్వరరావుకు మెజార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లల్లో మాత్రం రేణుకాచౌదరికి 106 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాగా గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కేవలం ఖమ్మం స్థానంలో మాత్రమే విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు అన్నిచోట్ల మెజార్టీ సాధించడం విశేషం. శాసనసభ్యులుగా గెలిచినవారిలో కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, పాలేరు శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరగా పాత, కొత్త ఎమ్మెల్యేల వర్గాలుగా విడిపోయిన నేతలతో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఇబ్బందులు ఉంటాయని అందరు భావించారు. కానీ కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గమైన మధిరతో పాటు టీఆర్‌ఎస్ పార్టీల్లో వర్గాలు అధికంగా ఉన్న వైరా నియోజకవర్గంలో కూడ నామాకు మెజార్టీ వచ్చింది. నామా గెలుపుకోసం నేతలంతా సమష్టిగా కృషి చేశారని అందుకే అన్ని ప్రాంతాలల్లోను టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి నిరాశ చెందకుండా కార్యకర్తలు ఖమ్మం పార్లమెంట్‌లో తొలిసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించడం ద్వారా జిల్లాలో పార్టీ బలంగా ఉందని నిరూపించారన్నారు. కాగా డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందిన నామా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. కేవలం నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరి టిక్కెట్ సాధించుకున్న నామా నాగేశ్వరరావుకు టీఆర్‌ఎస్ నేతలు వర్గాలకు అతీతంగా మద్దతు పలకడం విశేషం.
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నామా...?
ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన నామా నాగేశ్వరరావుకు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం రానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో సీనియరైన నామాకు కలసిరానున్నది. గతంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతగా పనిచేసిన అనుభవంతో పాటు ఇప్పుడు గెలిచిన 9 మందిలో ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు కలిగి ఉండటం, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడ గలగడం ఆయనకు కలసివచ్చే అంశాలు. దీనిపై టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇదే అంశంపై జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కూడ పార్టీ అధిష్ఠానం చర్చించినట్లు తెలిసింది. తుమ్మల కూడ అమోదం తెలపడంతో మరో వారం రోజుల్లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నామా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.