రాష్ట్రీయం

చతికిలబడ్డ ‘చంద్రులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి)
హైదరాబాద్, మే 23: హస్తినలో చక్రం తిప్పాలనుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే. చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో చతికిలబడ్డారు. గురువారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇద్దరు చంద్రులూ షాక్‌కు గురయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్, చంద్రబాబు భావించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీకీ సంపూర్ణమైన మెజారిటీ రాదని, అప్పుడు తామే కీలకంగా మారుతామని ఒకవైపు చంద్రబాబు, మరోవైపు కేసీఆర్ భావించారు. అంతేకాదు కొత్తగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలంగా పాల్గొనేందుకు ఉత్సాహం కనబరిచారు. ఆ మేరకు ఆయన కాంగ్రెస్, బీజేపియేతర పార్టీల నాయకులను కలుస్తూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళనున్నారని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని, అందుకే తన కుమారుడు కల్వకుంట్ల రామారావును మంత్రివర్గంలోకి తీసుకోకుండా పార్టీ బాధ్యతలు అప్పగించారని పార్టీ నాయకులు భావించారు. పార్టీ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటంటే, తొలుత పార్టీపై సంపూర్ణంగా పట్టు సాధించాలని, తర్వాత కేటీఆర్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి, తాను కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని కేసీఆర్ అనుకున్నట్లు పార్టీ వర్గాలు భావించాయి. అంతేకాదు ఆ విధమైన ప్రచారం కూడా జరిగింది. అయితే ఫలితాలు అందుకు భిన్నంగా వెలువడ్డాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు స్పష్టమైన మెజారిటీ రావడంతో ఇక ఫెడరల్ ఫ్రంట్ సంగతి లేనట్లేనని రాజకీయ విశే్లషకులు అంటున్నారు.
మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌కు చేరువై బీజేపీని తూర్పారబట్టారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టి వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దీంతో ఎన్డీఏ కుప్పకూలుతుందన్న బాబు అంఛనా తలకిందులైంది. తరచూ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కలవడం, ఇంకా బీజేపియేతర పార్టీల నాయకులను కలిసి చర్చించారు. కానీ బాబు అనుకున్నట్లు జరగలేదు. అటు కేంద్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి అయిన యుపీఏ అధికారంలోకి రాలేదు, ఇంకో వైపు ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. లోక్‌సభ సీట్ల విషయంలోనూ బాబుకు పెద్ద షాక్ తగిలింది.
కేసీఆర్ కుమార్తె,
బాబు కుమారుడు
ఇలాఉండగా ఇద్దరు నాయకులకు మరో షాక్ తగిలింది. కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోగా, చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి ఓటమిని చవిచూశారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడం, ఆశించిన విధంగా సీట్లు రాకపోవడంతో నేతలిద్దరి ‘చక్రం’ తిరగలేదని పలు పార్టీల నాయకులు అంటున్నారు.