రాష్ట్రీయం

మరికొంతకాలం ననే్న బలపరచండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: రాష్ట్భ్రావృద్ధి కోసం ప్రజలు రాజకీయాలు విస్మరించి తనను మరికొంత కాలం బలపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే (వైకాపా) జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
విజయవాడ ఎ1 కనె్వన్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తాననే నమ్మకంతో ప్రజలు నిండు మనసుతో తనను ఆశీర్వదించారన్నారు. ‘నాపై ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. నా చివరి రక్తపు బిందువు వరకూ ఐదు కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్ కోసం శ్రమిస్తాను’ అని చంద్రబాబు చెప్పారు. మరికొద్ది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
సమన్యాయం జరగకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతోందని చంద్రబాబు విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, అందుకే భారీ మూల్యం చెల్లించిందన్నారు.
మనసు చంపుకొని వైకాపాలో ఉన్నా
టిడిపిలో చేరిన జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అవగాహన లేని, అవగాహన చేసుకోడానికి ప్రయత్నించని జగన్ దగ్గర ఇన్నాళ్లూ మనసు చంపుకొని ఉన్నానని జ్యోతుల అన్నారు. పార్టీలో తను తప్ప మిగిలిన వారంతా జీరో అనే భావనతో జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ చిత్రపటాన్ని, రాజకీయ స్ఫూర్తినిచ్చిన చంద్రబాబు చిత్రపటాన్ని తను ఇప్పటికీ తొలగించలేదన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో నిలిచిపోయిన నీటి పథకాలను పూర్తిచేయాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. జ్యోతుల అభ్యర్థన మేరకు పాములేరు చెక్‌డ్యాం నుంచి భూపతిపాలెంకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

chitram జ్యోతుల నెహ్రూకు పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు