రాష్ట్రీయం

నేటి నుంచి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 11: రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ హయాంలో తొలిసారిగా సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు సుదీర్ఘ విరామం తరువాత సమావేశాలకు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా ఛాంబర్ల కొంత కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఎన్నడూలేని రీతిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు మరో ఐదుగురు ప్రభుత్వ విప్‌లు, స్పీకర్, ప్రతిపక్ష నేత చాంబర్ల ఎంపిక అధికారులకు కష్టతరంగా మారింది. సమావేశాల నిర్వహణ సందర్భంగా మంగళవారం శాసనసభ అడుగడుగునా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం 11.05 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు ఈ నెల 18తో ముగియనున్నాయి. మొదటి రెండు రోజులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులచే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి హోదాలో జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణం చేస్తారు. 13న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ స్థానంలో ఆశీనులైన అనంతరం ఆ రోజు సభ వాయిదా పడుతుంది. 14న ఉభయసభల నుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 15, 16 తేదీలు సెలవులు కాగా 17వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 18న ధన్యవాదాల తీర్మానం ఆమోదంతో సమావేశాలు వాయిదా వేస్తారు. శాసనసభలో ముందుగా జగన్మోహన్‌రెడ్డి తరువాత ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రసంగాలు ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి జూన్ నెలాఖరులోగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. బడ్జెట్ కోసం సమావేశాలను పొడిగిస్తారా లేక మరో విడత నిర్వహిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గవర్నర్ ప్రసంగంలో నవరత్నాలు, ఎన్నికల అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. శాసనసభ సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల భద్రతకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిత్రాలు.. అసెంబ్లీ *బందోబస్తుకు సిద్ధమైన పోలీసులు