రాష్ట్రీయం

ఇసుక తవ్వకాలు, రవాణాపై 15 రోజుల నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై 15 రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటిచారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం 15 రోజుల్లో కొత్త మైనింగ్ పాలసీని తీసుకువస్తుందన్నారు. అప్పటి వరకూ ప్రజలు కాస్త ఓపిక పట్టాలని కోరారు. జూలై 1లోగా కొత్త పాలసీని తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో అక్రమ ఇసుక మైనింగ్, స్మగ్లింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఆదాయంలో 20 నుంచి 25 శాతం వరకూ మైనింగ్ ద్వారానే వస్తుందని గుర్తు చేశారు. మైనింగ్‌లో అక్రమాలు అరికట్టి ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త పాలసీ రూపొందించే వరకూ ఎక్కడైనా ఇసుక తవ్వకాలు, రవాణా జరిగితే ఆయా జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి ఎక్కడైనా తవ్వకాలు జరిపితే, పీడీ చట్టం ఉపయోగించి వారిని జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. గతంలో మైనింగ్ చేసి నిల్వ చేసిన ఇసుకను మాత్రం తరలించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ పాలసీని అధ్యయనం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయుక్తమైన ఉత్తమ పాలసీని రూపొందిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయల ఖనిజ సంపద దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకలో అక్రమాలు జరిగిన చోట్ల టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తుచేశారు. ఇసుక విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినా, తెలుగుదేశం నేతలంతా బాగా లాభపడ్డారని ఆరోపించారు. గత ఏడాది మైనింగ్ ద్వారా 2643 కోట్ల రూపాయలు రాగా, ఇసుక ద్వారా 116 కోట్ల రూపాయలే వచ్చిందని వివరించారు. రాష్ట్రం నుంచి చెన్నై, కర్నాటకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు. గతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై టీడీపీ నేతలు దాడికి దిగారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక ర్యాంపులు 202 నుంచి 116కు తగ్గిపోయాయన్నారు.
చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి