రాష్ట్రీయం

‘ఆర్టీసీ’పై నేడు ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మె విరమణపై బుధవారం స్పష్టత రానుంది. ఇప్పటికే పలు దఫాలుగా ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలో కొంత పురోగతి కనిపించగా, తాజాగా మంగళవారం యాజమాన్యంతో జరిపిన చర్చలు సైతం చాలా వరకు ఫలప్రదమయ్యాయి. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ ఎన్ సరేంద్రబాబుతో ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుల మధ్య రెండవ రోజు చర్చలు ఫలప్రదంగా జరిగాయి. చర్చల సందర్భంగా 35 శాతం వరకు అద్దె బస్సుల పెంపుదల చేయాలనే యోచనను యాజమాన్యం విరమించుకుంది. అన్ని కేటగిరీలలో ఉన్న ప్రమోషన్లు జూన్, జూలై నెలల్లోనే ఇచ్చేందుకు యజమాన్యం అంగీకరించింది. వీటితో పాటు ఆర్టీసీ ఉద్యోగి భార్య/్భర్తకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించే గుర్తింపు కార్డు జారీ చేసేందుకు, పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ రుణాలు వెంటనే విడుదల చేసేందుకు అంగీకరించినట్లు జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, కో కన్వీనర్లు సీహెచ్ సుందరయ్య, వి వరహాల నాయుడు తెలిపారు. కారుణ్య నియామకాలు ఈ నెలలో చేపట్టేందుకు, మిగిలి ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను విధులలోకి తీసుకుని, ప్రస్తుతం 240 రోజులు సర్వీసు పూర్తయి రెగ్యులర్ కాని కాంట్రాక్ట్ కండక్టర్లు, డ్రైవర్లును ఈ నెలలోనే రెగ్యులర్ చేసేందుకు యాజమాన్యం సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. మెడికల్ బిల్లుల చెల్లింపు, వేతన వ్యత్యాసాల సవరణకు, డిజిటల్ చార్ట్‌లను కార్మిక సంఘాలు కోరిన విధంగా వేసేందుకు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి సైతం రిఫరల్ ఆసుపత్రుల్లో చెల్లించే విధంగా బిల్లుల చెల్లింపునకు అంగీకరించినట్లు తెలిపారు. ఆన్ డ్యూటీలో ప్రమాదానికి గురై అన్‌ఫిట్ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించేందుకు, అలవెన్సులను త్వరలో పెంచేందుకు, జీపీఆర్‌ఎస్ ద్వారా రన్నింగ్ టైమ్ సరిచేసేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు. సమ్మె నోటీసులోని 26 డిమాండ్లు పరిష్కరించేందుకు యాజమాన్యం సోమ, మంగళవారం జరిగిన చర్చలలో పూర్తి స్పష్టత ఇవ్వడంతో పాటు యాజమాన్యం అంగీకరించిన అంశాలపై జేఏసీకి లిఖిత పూర్వక ఒప్పంద పత్రాన్ని ఇచ్చినట్లు వారు తెలిపారు.
ఇలాఉంటే ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకునే అంశంలోనూ, ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. సమ్మె నోటీసుకు సంబంధించి యాజమాన్యం పరిధిలో ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించి, లిఖితపూర్వక హామీ ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృత్ఞతలు తెలపనున్నారు. సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం సమ్మె యోచన రద్దుపై జేఏసీ నేతలు కీలక ప్రకటన చేయనున్నారు.